మళ్లీ మూక దాడి.. బీఫ్ అమ్ముతున్నారని ఇద్దరిపై దాడి.. అర్ధనగ్నంగా ఊరేగింపు.. వీడియో వైరల్

Published : Nov 02, 2022, 05:34 PM IST
మళ్లీ మూక దాడి.. బీఫ్ అమ్ముతున్నారని ఇద్దరిపై దాడి.. అర్ధనగ్నంగా ఊరేగింపు.. వీడియో వైరల్

సారాంశం

ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ మూక దాడి చోటుచేసుకుంది. బీఫ్ అమ్ముతున్నారని ఇద్దరిపై మూక దాడి చేసింది. బెల్ట్‌తో దాడి చేసింది. అర్దనగ్నంగా ఊరేగించింది. వారి వెనుక మూక వెళ్లింది. చాలా మంది వీరిని వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

భోపాల్: ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ మూక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ అమ్ముతున్నారని ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. అర్ధనగ్నంగా ఊరేగించారు. చాలా మంది ఆ ఘటనను తమ సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీశారు. ఆన్ రికార్డులోనే ఒకరు బెల్ట్‌తో దాడి చేయడం ఆ వీడియో కనిపిస్తున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 33 కిలోల బీఫ్‌ను రికవరీ చేసుకున్నారు.

పోలీసుల ప్రకటన ప్రకారం, సుమిత్ నాయక్ నిన్న ఈ ఫిర్యాదు చేశారు. 50 ఏళ్ల నర్సింగ్ దాస్, 52 ఏళ్ల రామ్‌నివాస్ మెహర్ అనే ఇద్దరూ ఓ బైక్‌పై తెల్లటి సంచిలో బీఫ్‌ను తీసుకెళ్లుతున్నారు. వారిని ఫిర్యాదు చేసిన వారు అడ్డుకున్నారు. ఆ తెల్లటి సంచిలో ఏమున్నదో అడిగారు. అందులో బీఫ్ ఉన్నదని వారు తెలిపినట్టు ఫిర్యాదు చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పారు. వారిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Also Read: ఇప్పటి వరకు ఐదుగురిని చంపేశాం.. మూకదాడులపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్

33.5 కిలోల బీఫ్‌ను రికవరీ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరినీ పోలీసు కస్టడీలోకి తీసుకున్నట్టు వివరించారు. వారిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. ఆ మాంసాన్ని వెటరినరీ డాక్టర్ వద్దకు పరీక్ష చేయడానికి పంపించినట్టు పేర్కొన్నారు. కానీ, ఆ పరీక్షకు సంబంధించిన నివేదికపై ఎలాంటి సమాచారం లేదు. 

కాగా, బీఫ్ దొరికిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ, వారిపై దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అనే విషయంపై సమాచారం లేదు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..