ఇద్దరు లాయర్‌లను జైలుకు పంపిన కోర్టు.. అజీమ్ ప్రేమ్‌జీపై ఒకే అంశంపై పలు పిటిషన్లు

By Mahesh KFirst Published Jan 16, 2022, 3:22 AM IST
Highlights

కర్ణాటక హైకోర్టు ఇద్దరు న్యాయవాదలు రెండు నెలలపాటు జైలుకు పంపింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీపై ఒకే అంశంపై చాలా పిటిషన్లు దాఖలు చేశారని, వారించినా వారు పిటిషన్లు వేయడం ఆపలేదని కోర్టు తెలిపింది. అందుకే కోర్టు ధిక్కరణ కింద నేరస్తులుగా పరిగణించి వారికి రెండు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. వారు వాదిస్తున్న సంస్థపైనా గతంలోనే రూ. 10 లక్షల జరిమానా పడటం గమనార్హం.
 

బెంగళూరు: లాయర్లు(Advocates) అంటే.. పిటిషనర్‌ల తరఫు వాదిస్తారు. న్యాయవ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకుని ఆ న్యాయాన్ని సామాన్యులకు అందించడంలో వారధిగా పని చేస్తారు. కానీ, కర్ణాటక హైకోర్టులో ఈ సీన్ కొంత రివర్స్ అయింది. ఆ హైకోర్టు ఏకంగా ఇద్దరు లాయర్లనే జైలుకు పంపింది. విప్రో(Wipro) సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌(Azim Premji)పై ఒకే అంశంపై ఒకటికి మించి తరుచూ పిటిషన్లు వేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇది ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయడమే కాదు, న్యాయవ్యవస్థ పాలననూ ప్రభావితం చేస్తున్నదని మండిపడింది. కోర్టు(Karnataka High Court) ధిక్కారం కింద ఇద్దరు న్యాయవాదులను రెండు నెలల సాధారణ జైలు శిక్షను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇండియా అవేక్ ఫర్ ట్రాన్స్‌పరెన్సీ అనే ఎన్‌జీవో తరఫున ఇద్దరు లాయర్లు ఆర్ సుబ్రమనియన్, పీ సదానంద్‌లు హైకోర్టులో వాదనలు వినిపించారు. పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీపై ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున ఇద్దరు న్యాయవాదులు చాలా రిట్ పిటిషన్లు వేశారు. ఆ అన్నింటిని విచారించిన కర్ణాటక హైకోర్టు వాటిని తోసిపుచ్చింది. అయినప్పటికీ అజీమ్ ప్రేమ్‌జీపై ఒకే అంశ చుట్టూ ఆ న్యాయవాదులు పలుసార్లు పిటిషన్లు వేశారు. దీనితో హైకోర్టు వారిద్దరినీ మందలించింది. జస్టిస్ బీ వీరప్ప, జస్టిస్ కేఎస్ హేమలేకలతో కూడిన డివిజన్ బెంచ్ వారిద్దరిని రెండు నెలలపాటు జైలుకు వెళ్లిందిగా ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు వారు పాల్పడినట్టు తెలిపింది. రెండు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 2 వేల జరిమానా విధించింది. అంతేకాదు, వారిద్దరూ అజీమ్ ప్రేమ్‌జీపై లేదా.. ఆయనకు సంబంధించిన ఇతర సంస్థపై పిటిషన్లు వేయరాదని నిషేధం విధించింది.

డిసెంబర్ 23న వీరిద్దరిపై అభియోగాలు నమోదయ్యాయి. జనవరి 7వ తేదీ వరకు ఈ అభియోగాలపై ఇరువైపులా వాదనలు విన్నది. అప్పుడే తీర్పు రిజర్వ్ చేసింది. డిసెంబర్ 23నాటి హైకోర్టు ఆర్డర్‌లో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

ఒకే అంశంపై చాలా సార్లు రిట్ పిటిషన్ వేశారని.. అలా పిటిషన్లు వేయవద్దని నిషేధించినా.. వారు ఆగలేదని జడ్జీలు తెలిపారు. వారు కోర్టులో చాలా కేసులు ఫైల్ చేశారని వివరించారు. వారించినా.. ఒకే అంశంపై చాలా పిటిషన్లు వేయడం సరికాదని, ఇలా చేస్తే ప్రజా ప్రయోజనాలు దెబ్బతినడమే కాదు.. న్యాయవ్యవస్థనూ అవహేళన చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ కాలాన్ని వృథా చేయడం, న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని న్యాయమూర్తులు వివరించారు. న్యాయవాదులపైనే కాదు.. ఆ సంస్థ ఇండియా అవేక్ పర్ ట్రాన్స్‌పరెన్సీ కూడా అజీమ్ ప్రేమ్‌జీపై ఒకే అంశంపై చాలా సార్లు పిటిషన్ వేసిందని, ఇందుకోసం ఆ సంస్థకు రూ. 10 లక్షల జరిమానా విధించింది.

click me!