బెంగళూరులో పిల్ల‌ర్ కూలి ఇద్దరు మృతి.. సీఎం రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్

By Mahesh RajamoniFirst Published Jan 10, 2023, 4:44 PM IST
Highlights

Bangalore: బెంగళూరులోని నవగరా ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో పిల్లర్ రోడ్డుపై కూలింది. ఆ స‌మ‌యంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక కుటుంబంలోని నలుగురు స‌భ్యుల‌పై ప‌డింది. తీవ్ర‌ గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తల్లి, రెండున్నరేళ్ల కుమారుడు మృతి చెందారు.
 

Bengaluru pillar collapse kills 2: బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఒక మహిళ, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు మరణించారు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మహిళ భర్తకు కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ, ఆమె బిడ్డ మరణించారు. బెంగళూరులోని నాగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క‌ళ్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఅవుట్‌కు వెళ్లే రోడ్డులో ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైలు పిల్లర్‌ కూలిపోయింది. 

ఈ ఘటనలో రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి, అతని భార్య, వారి కుమారుడు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్ర‌ గాయాలపాలైన తల్లి, బిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు 25 ఏళ్ల తేజస్వి, ఆమె కుమారుడు విహాన్‌గా గుర్తించారు. డీసీపీ భీమాశంకర్ ఎస్ గులేద్ మాట్లాడుతూ.. “తమ కొడుకుతో కలిసి దంపతులు హెబ్బాల్ వైపు వెళ్తున్నారు. మెట్రో పిల్లర్ ఓవర్‌లోడ్‌తో బైక్‌పై కూలింది. తల్లి,  కొడుకు పిలియన్ రైడర్స్. తీవ్రంగా గాయపడిన వారిని ఆల్టిస్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిని తేజస్విని, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు విహాన్‌గా గుర్తించారని తెలిపారు. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది. బెంగళూరు మెట్రోలో నిర్మాణంలో ఉన్న పిల్లర్ కూలి ఓ మహిళ, ఆమె రెండేళ్ల కొడుకు మృతి చెందడంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ శాఖల్లో 40 శాతం కమిషన్ కార‌ణంగా ఇది  జ‌రిగిందంటూ తీవ్రంగా ఆరోపించింది. నగరంలోని హెచ్బీఆర్ లేఅవుట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 40 అడుగుల ఎత్తు, అనేక టన్నుల బరువున్న నిర్మాణంలో ఉన్న స్తంభం కూలిపోయింది. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం ద్విచక్రవాహనంపై వెళుతోంది. ఈ ఘటనలో భార్య, ఆమె కుమారుడు మృతి చెందగా, ఆమె భర్త, కుమార్తె గాయపడ్డారు.

కొద్దిసేపటి తరువాత, ముఖ్యమంత్రి బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ, "నేను ఆ ప్ర‌మాదం గురించి తెలుసుకున్నాను, మేము దానిపై దర్యాప్తు చేస్తాము... స్తంభం కూలిపోవడానికి గల కారణాన్ని గుర్తించి పరిహారం అందిస్తామ‌ని తెలిపారు. కానీ రాష్ట్రంలో జరగబోయే రాష్ట్ర ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఈ సంఘటన రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. '40 శాతం కమిషన్ ప్రభుత్వ ఫలితమే ఇది. అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదు' అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. గతంలో కూడా అవినీతి ఆరోపణల మధ్య కాంట్రాక్టర్ల మరణంపై గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది.

నిర్మాణంలో ఉన్న స్తంభం ఒక మహిళ, చిన్నారిపై పడడం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఇప్పటి వరకు గుంతల మరణాలు జరిగాయి, ఇప్పుడు స్తంభాలు కూలిపోతున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వ ఉల్లంఘన, నిర్లక్ష్యానికి, అవినీతికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి అన్నారు. 'కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఇది పేలవమైన పనికి స్పష్టమైన ఉదాహరణ.. ప్రజలు దానికి లొంగిపోయారు. ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక ప్రజలు విసిగిపోయారని ఆమె అన్నారు.

click me!