ఎయిర్‌షోలో అపశృతి: రెండు జెట్‌లు ఢీ, పైలట్ దుర్మరణం (వీడియో)

By Siva KodatiFirst Published 19, Feb 2019, 1:08 PM IST
Highlights

బెంగళూరులో ఎయిర్‌షోలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని యలహంక ఎయిర్‌బేస్ వద్ద వైమానిక దళ విన్యాసాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్యకిరణ్ ఏరోబేటిక్స్ బృందం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా రెండు జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి
 

బెంగళూరులో ఎయిర్‌షోలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని యలహంక ఎయిర్‌బేస్ వద్ద వైమానిక దళ విన్యాసాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్యకిరణ్ ఏరోబేటిక్స్ బృందం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా రెండు జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.

బుధవారం నుంచి బెంగళూరు వేదికగా ఎయిరో ఇండియా షో జరగనుంది. దీనికి ముందుగా ఎయిర్‌ఫోర్స్ రిహార్సల్స్ చేపట్టింది. ఈ క్రమంలో యలహంక ఎయిర్‌బేస్ నుంచి సూర్యకిరణ్ విమానాలు విన్యాసాలను ప్రారంభించాయి.

ఉదయం 11.50 గంటల ప్రాంతంలో రెండు విమానాలు ఒక దానికొకటి ఢీకొట్టుకుని దగ్గర్లోని జనావాసాలపై పడ్డాయి. అయితే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టిన రెండు విమానాల్లోని పైలెట్లు పారాచ్యూట్ల సాయంతో కిందకు దిగారు.

అయితే ముగ్గురు పైలెట్లలోని ఒకరు దుర్మరణం పాలయ్యారు.  విమాన శకలాలు పడిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

ప్రతిష్టాత్మక బెంగళూరు ఎయిర్‌షో 1996లో ప్రారంభమైంది.. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ షోకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. ఈ ఏడాది ఈవెంట్‌కు అమెరికా నేవికా దళానికి చెందిన ఎఫ్ఏ 18 సూపర్ హోర్నెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

"

 

Last Updated 19, Feb 2019, 2:07 PM IST