రుణాలు మాఫీ, రూ.30 లక్షల ఇన్సూరెన్స్: అమర జవాన్లకు ఎస్బీఐ నివాళి

By Siva KodatiFirst Published Feb 19, 2019, 12:54 PM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. ముష్కరుల దాడిలో అమరులైన 44 మంది జవాన్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. 

దీంతో పాటు రూ.30 లక్షల ఇన్సూరెన్స్‌ డబ్బును ప్రతీ సైనిక కుటుంబానికి అందజేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అమర జవాన్లకు సంస్థ ఉద్యోగులు విరాళాలు ఇవ్వాలని కోరింది. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 44 మంది జవాన్లలో 23 మంది సైనికులు ఎస్‌బీఐ నుంచి రుణాలను తీసుకున్నారు. 

click me!