త్వరలో ఎన్నికలు..మెర్సిడెస్ కారులో రూ.2కోట్లు

Published : Mar 20, 2019, 12:19 PM IST
త్వరలో ఎన్నికలు..మెర్సిడెస్ కారులో రూ.2కోట్లు

సారాంశం

త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  పోలీసులు అప్రమత్తయ్యారు. 


త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  పోలీసులు అప్రమత్తయ్యారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు తరలించే అవకాశం ఉండటంతో.. పలు చోట్ల  తనిఖీలు చేపట్టారు. కాగా.. ముంబయి శివారు గ్రామంలో ఓ మెర్సిడెస్ కారులో రూ.2కోట్ల రూపాయలు వెలుగు చూశాయి.

బీద్ జిల్లా అమల్నేర్ గ్రామ చెక్ పోస్టు వద్ద ఎన్నికల నిఘా అధికారులు తనిఖీలు చేస్తుండగా మెర్సిడెస్ కారు కనిపించింది. అందులో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు కోట్ల రూపాయలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

వెంటనే నగదు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?
మీకు SBI లో అకౌంట్ ఉందా..? అయితే ఈజీగా రూ.35,00,000 పొందవచ్చు.. ఏం చేయాలో తెలుసా?