గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం..

Published : Jul 19, 2022, 03:46 PM IST
గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం..

సారాంశం

గో ఫస్ట్ సంస్థకు రెండు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మంగళవారం ముంబై నుంచి లేహ్, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న గో ఫస్ట్ విమానాల ఇంజన్‌లలో సమస్యలు తలెత్తడంతో వాటిని ల్యాండ్ చేసినట్టుగా అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వారాసంస్థ రిపోర్ట్ చేసింది.

గో ఫస్ట్ సంస్థకు రెండు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మంగళవారం ముంబై నుంచి లేహ్, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న గో ఫస్ట్ విమానాల ఇంజన్‌లలో సమస్యలు తలెత్తడంతో వాటిని ల్యాండ్ చేసినట్టుగా అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వారాసంస్థ రిపోర్ట్ చేసింది. ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానం ఇంజన్ నంబర్ 2లో లోపం గుర్తించడటంతో దానిని ఢిల్లీలో గ్రౌండ్ చేసినట్టుగా  డీజీసీఏ అధికారులు తెలిపారు. అలాగే  శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న మరో గో ఫస్ట్ విమానం మిడ్ ఎయిర్‌లో ఉన్న సమయంలో ఇంజిన్ నంబర్ 2లో లోపం తలెత్తడంతో.. తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు. 

ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా డీజీసీఏ పేర్కొంది. తమ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆ రెండు విమానాల టేకాఫ్ అవుతాయని పేర్కొంది.అయితే ఒకే రోజు గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక, గత నెల రోజుల వ్యవధిలో కొన్ని భారతీయ విమానయాన సంస్థలకు చెందిన అనేక విమానాల్లో సాంకేతిక లోపాలు చోటుచేసుకున్న ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా.. భద్రత పర్యవేక్షణను నిర్దారించడానికి విమానయాన సంస్థలు, మంత్రిత్వ శాఖ, DGCA అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు. ప్రయాణీకుల భద్రతే ముఖ్యమని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిపారు. 

ప్రయాణీకుల భద్రతకు ఆటంకం కలిగించే చిన్న పొరపాటు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాటిని సరిదిద్దుతామని కేంద్ర మంత్రి తెలిపారు. ‘‘ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమైనది. భద్రతకు ఆటంకం కలిగించే చిన్నపాటి లోపం కూడా క్షుణ్ణంగా పరిశోధించబడుతుంది’’ అని స్పైస్‌జెట్‌ సంస్థకు డీజీసీఏ జారీ చేసిన షో-కాజ్ నోటీసును షేర్ చేసిన సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?