నటుడు విజయ్ కాంత్ ఇంట్లో చోరీ.. ఏం ఎత్తుకెల్లారంటే..

Published : Oct 13, 2018, 12:37 PM IST
నటుడు విజయ్ కాంత్ ఇంట్లో చోరీ.. ఏం ఎత్తుకెల్లారంటే..

సారాంశం

పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం వద్ద ఆయన కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. ఆ ఇంటి వెనుక మూడు పాడి ఆవులు పెంచుతున్నారు

సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కొత్త ఇంట్లో చోరీ జరిగింది. ఆ ఇంటిలోని రెండు ఆవులను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనతో ఆయన దిగులు చెందినట్లు సమాచారం.

విజయకాంత్‌, ఆయన సతీమణి ప్రేమలత.. తమిళనాడులోని సాలిగ్రామంలో నివసిస్తున్నారు. పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం వద్ద ఆయన కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. ఆ ఇంటి వెనుక మూడు పాడి ఆవులు పెంచుతున్నారు. అక్కడ అప్పారావు అనే వ్యక్తి వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పాకలో చొరబడి రెండు ఆవులను అపహరించుకెళ్లారు. 

వెంటనే అప్పా రావు ఆ ఆవుల కోసం చుట్టుపక్కల వెదికినా కనిపించ లేదు. చివరకు విజయకాంత్‌కు ఆయన సమాచారం అందించటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పూట తాను పెంచుకుంటున్న ఆవులు చోరీకి గురికావడంతో విజయకాంత్‌ దిగులు చెందారు.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే