రౌడీ గ్యాంగ్ కాల్పులు ... పోలీసు అధికారి మృతి

Published : Oct 13, 2018, 12:25 PM IST
రౌడీ గ్యాంగ్ కాల్పులు ... పోలీసు అధికారి మృతి

సారాంశం

ఖగారియా శివారులోని సలార్‌పూర్‌లో కరడుగట్టిన నేరస్థుడు దినేశ్‌ ముని ముఠా సంచరిస్తోందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆశిశ్ కుమార్ సింగ్ ..వారిని అరెస్టు చేసేందుకు  మరికొందరు పోలీసులతో అక్కడికి వెళ్లాడు.  

రౌడీ గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన బిహార్ లోని ఖగారియా జిల్లా సరిహద్దులో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడింది దినేవ్ మునీ గ్యాంగ్ గా పోలీసులు భావిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖగారియా శివారులోని సలార్‌పూర్‌లో కరడుగట్టిన నేరస్థుడు దినేశ్‌ ముని ముఠా సంచరిస్తోందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆశిశ్ కుమార్ సింగ్ ..వారిని అరెస్టు చేసేందుకు  మరికొందరు పోలీసులతో అక్కడికి వెళ్లాడు.

పోలీసులను చూడగానే అప్రమత్తమైన దినేశ్ ముఠా కాల్పులు మొదలుపెట్టింది. పోలీసులు సైతం వారిని తిప్పికొట్టేందుకు ప్రయత్నించడంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. దినేశ్ ముఠా కాల్పుల్లో ఎస్‌హెచ్‌వో కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆస్పత్రి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. కాగా దినేశ్ ముఠాను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ కొందరు పారిపోయినట్టు చెబుతున్నారు.  ఈ ఘటనలో మరో పోలీసు కూడా గాయపడ్డారనీ... భాగల్పూర్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?