తేనెటీగల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు...

By SumaBala Bukka  |  First Published Sep 20, 2023, 10:18 AM IST

తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ విషాదఘటన లక్నోలో వెలుగు చూసింది. వారిని కాపాడడానికి ప్రయత్నించిన వారి అమ్మమ్మ తీవ్రంగా గాయాలపాలైంది. 


లఖ్‌నవూ : గోండా జిల్లాలోని మాన్‌కాపూర్‌లో మంగళవారం ఇద్దరు సోదరులు యుగ్ (6), యోగేష్ శుక్లా (4) తేనెటీగలు కుట్టడంతో మరణించారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన అమ్మమ్మ ఉత్తమాదేవి (70) కూడా దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇద్దరు పిల్లలు తమ అమ్మమ్మతో కలిసి మద్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్తుండగా దారిలో తేనెటీగలు దాడి చేశాయని సదర్ సర్కిల్ అధికారి శిల్పా వర్మ తెలిపారు. "గ్రామస్తులు తేనెటీగలకు పొగపెట్టడానికి ప్రయత్నించారు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది" అని వర్మ అన్నారు. 

Latest Videos

సోషల్ మీడియా యాక్సెస్ కు కనీస వయస్సు ఏర్పాటు చేయండి... కర్ణాటక హైకోర్టు

తేనెటీగల దాడిలో గాయపడిన పిల్లలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు  నిర్ధారించారు. పిల్లల తల్లి రోషిణి దేవి వారి మరణవార్త విని స్పృహతప్పి పడిపోయింది. వారి తండ్రి రమేష్‌ కుమార్‌ ను ఓదార్చడం ఎవ్వరి తరం కావడంలేదు. 

ఈ ఘోర ప్రమాదంతో గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తేనెటీగ దాడులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ప్రాణాంతకంగా మారతాయి. తేనెటీగలు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం, రక్షణ దుస్తులు ధరించడం, పరిసరాలపై అవగాహన ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్థానికులకు సూచించారు.

click me!