టీనేజ్ సోదరితో సంబంధం... కోపంతో కత్తులతో పొడిచి చంపిన అన్నలు.. !

Published : Aug 19, 2021, 11:07 AM IST
టీనేజ్ సోదరితో సంబంధం... కోపంతో కత్తులతో పొడిచి చంపిన అన్నలు.. !

సారాంశం

మహదా కాలనీలోని టీనేజ్ యువతితో సంబంధం పెట్టుకున్న కమలేష్ అమ్మాయికి మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రుల వివాహితుడితో సంబంధం పెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. 

తన టీనేజ్ సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇద్దరు సోదరులు కలిసి హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగు చూసింది. నాగపూర్ నగరంలోని కపిల్ నగర్ గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే వివాహమైనా, భార్య వదిలేసింది. దీంతో కమలేష్ కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. 

మహదా కాలనీలోని టీనేజ్ యువతితో సంబంధం పెట్టుకున్న కమలేష్ అమ్మాయికి మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రుల వివాహితుడితో సంబంధం పెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు కమలేష్ మీద పోలీసులు ఐసీసీ సెక్షన్ 354 ఎ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. 

రెండు వారాల పాటు జైలులో ఉన్న కమలేశ్ విడుదలయ్యాక మళ్లీ సోదరి వద్దకు వస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన బాలిక సోదరులిద్దరూ వారి స్నేహితులతో కలిసి కమలేష్ ను పట్టుకుని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు బాలిక సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?