గత 24 గంటల్లో ఇండియాలో 36,401 కరోనా కేసులు: మొత్తం 3.23 కోట్లకు చేరిన కేసులు

By narsimha lodeFirst Published Aug 19, 2021, 10:36 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తోంది.నిన్న ఒక్కరోజే 36,401 మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు 3.23 కోట్ల మందికి కరోనా సోకింది.అంతకుముందు రోజుతో పోలిస్తే 3.4 శాతం కరోనా కేసులు పెరిగాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 36,401 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 18,73,757 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 36,401 మందికి కరోనా సోకినట్టుగా  ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరుకొంది.

అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కేసుల్లో 3.4 శాతం కరోనా కేసుల్లో పెరుగుదల  ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే కరోనాతో  530 మంది మరణించారు.  దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,33,039కి చేరుకొంది.

నిన్న ఒక్క రోజే 39 వేల మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 3.15 కోట్ల మంది కోలుకొన్నారు.  దేశంలో కరోనా రోగుల రికవరీ  97.53 శాతంగా నమోదైంది.  క్రియాశీల కేసులు 3.6 లక్షలకు చేరుకొంది.

కరోనా యాక్టివ్ కేసులు 1.13 శాతంగా ఉందని ఐసీఎంఆర్ ప్రకటించింది.  నిన్న ఒక్క రోజే 56,36,336 మంది కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారు. ఇప్పటివరకు 56.64 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.


 

click me!