బెంగాల్: ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా.. 75కు పడిపోయిన కమలనాథుల బలం

By Siva KodatiFirst Published May 13, 2021, 2:55 PM IST
Highlights

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌లు రాజీనామా చేసి అనంతరం తమ రాజీనామా లేఖలను స్పీకర్ బిమన్ బెనర్జీకి అందజేశారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌లు రాజీనామా చేసి అనంతరం తమ రాజీనామా లేఖలను స్పీకర్ బిమన్ బెనర్జీకి అందజేశారు.

ఈ ఇద్దరూ బీజేపీ ఎంపీలుగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తాజాగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో వీరు ఇకపై ఎంపీలుగా కొనసాగుతారు. రణఘాట్‌ నియోజవర్గానికి జగన్నాథ్ సర్కార్ ఎంపీగా ఉండగా, కూచ్‌బెహర్ నియోజకవర్గానికి ప్రమాణిక్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Also Read:నందిగ్రామ్‌: నాడు లెఫ్ట్‌ప్రంట్‌కు, నేడు సువేంద్‌పై మమత దెబ్బ

బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు సర్కార్, ప్రమాణిక్ తెలిపారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగాలని అధిష్ఠానం ఆదేశించిందని వారు మీడియాకు తెలిపారు.

అధిష్ఠానం నుంచి సమాధానం రాకపోవడంతో ఈ ఇద్దరూ గత వారం ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా ఈ ఇద్దరూ రాజీనామా చేయడంతో ఆరు నెలల్లోగా వారు గెలిచిన దిన్‌హటా, శాంతిపూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఇద్దరి రాజానామాలతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 77 నుంచి 75కు తగ్గింది.

click me!