కరోనా ఎఫెక్ట్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా, అక్టోబర్ 10న ఎగ్జామ్స్

Published : May 13, 2021, 02:48 PM IST
కరోనా ఎఫెక్ట్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా, అక్టోబర్ 10న ఎగ్జామ్స్

సారాంశం

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదావేస్తూ  యూపీఎస్‌సీ నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదావేస్తూ  యూపీఎస్‌సీ నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.ఈ ఏడాది జూన్ 27వ తేదీన సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.కరోనా కేసులు దేశంలో భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్టుగా యూపీఎస్‌సీ ప్రకటించింది. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఎఎస్) అధికారుల ఎంపిక కోసం     యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహిస్తోంది.

గత ఏడాది కూడ కరోనా కారణంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు వాయిదాపడ్డాయి. గత  ఏడాది మే 31 నుండి అక్టోబర్ 4వ తేదీకి పరీక్షలను వాయిదా వేశారు.అయితే మెయిన్ పరీక్ష నిర్వహించినప్పటికీ ఇంటర్వ్యూ ఇంకా నిర్వహించాల్సి ఉంది. కరోనా కేసుల పెరుగుదలతో ఈ ఇంటర్వ్యూలను ఇంకా నిర్వహించలేదు.యూపీఎస్‌సీ ఇతర పరీక్షలను కూడ వాయిదా వేసింది. దేశంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపథ్యంో పలు యూనివర్శీలు కూడ  కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాయి. చాలా  రాష్ట్ర ప్రభుత్వాలు 10వ, 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయి. 


 

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి