‘మందు తీసుకో మచ్చా’ అన్నందుకు.. ఇద్దరి ప్రాణాలు బలి... !

Published : Sep 09, 2021, 11:16 AM IST
‘మందు తీసుకో మచ్చా’ అన్నందుకు.. ఇద్దరి ప్రాణాలు బలి... !

సారాంశం

నాలుగు రోజుల క్రితం మద్యం తాగి గొడవపడి ఇద్దరిని హత్య చేసిన కేసులో.. ఇద్దరిని హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అసోంకు చెందిన అబ్దుల్ కరీం, దారుల్ అలం. బెంగళూరు వాసి రవికుమార్, కోల్ కతాకు చెందిన చందన్ దాసులను వీరు హత్య చేశారు. 

కర్ణాటక : కర్ణాటక లో దారుణం జరిగిపోయింది. ఓ చిన్న మాట నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాగినమత్తులో మాటా మాటా పెరిగి ఇద్దరి ప్రాణాలు పోగా, మరో ఇద్దరు నిందితులుగా మారాల్సి వచ్చింది. 

నాలుగు రోజుల క్రితం మద్యం తాగి గొడవపడి ఇద్దరిని హత్య చేసిన కేసులో.. ఇద్దరిని హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అసోంకు చెందిన అబ్దుల్ కరీం, దారుల్ అలం. బెంగళూరు వాసి రవికుమార్, కోల్ కతాకు చెందిన చందన్ దాసులను వీరు హత్య చేశారు. 

కూలీపనులు చేసుకునే వీరందరూ స్నేహితులు. కాగా, ఘటన జరిగిన రోజు ఆనేకల్ తాలూకా సింగేన అగ్రహార వద్ద నీలగిరి చెట్లలో మద్యం తాగారు. ఆ సమయంలో కరీం రవికుమార్ ను.. ‘మందు తీసుకో మచ్చా’ అన్నాడు.. అంతే గొడవ మొదలయ్యింది. 

నువ్వు నన్ను మచ్చా అంటావా.. అని రవికుమార్ కరీం మీద గొడవకు దిగాడు. అదేం తప్పుమాట కాదంటూ కరీం... చెబుతున్నా వినకుండా గొడవకు దిగడంతో.. ఘర్షణ ముదిరింది. దీంతో అబ్దులు కరీం, దారుల్‌ అలం కలిసి రవికుమార్ ను, చందన్ దాస్ లను దారుణంగా కొట్టి చంపి పరారయ్యారు. విమానంలో అసోంకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌