విషాదం : కొండచరియలు విరిగిపడడంతో.. భార్యను భుజాలపై మోస్తూ ఆస్పత్రికి.. కానీ..!

By AN TeluguFirst Published Sep 9, 2021, 11:02 AM IST
Highlights

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో స్థానికంగా ఉన్న సబ్-హెల్త్ సెంటర్ ను మూసేశారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలని వస్తోంది. రూరల్ ఆసుపత్రికి పోవాలంటే 22 కి.మీ దూరంలో ఉంది. దీంతో అనారోగ్యం బారిన పడిన భార్య సిధాలిని మోసుకుంటూ.. 65 ఏళ్ల ఆడ్ల్య పద్వి ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు.

మహారాష్ట్రలో హృదయ విదారక సంఘటన జరిగింది. తీవ్రంగా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడి రోడ్డు మూసుకుపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ 60 ఏళ్ల మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నందూర్‌బార్ అటవీప్రాంతంలో ఉన్న చందసాయిలి గ్రామంలో నివసిస్తున్న సిధాలిబాయి పద్వి అనారోగ్యంతో బాధపడుతోంది.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో స్థానికంగా ఉన్న సబ్-హెల్త్ సెంటర్ ను మూసేశారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలని వస్తోంది. రూరల్ ఆసుపత్రికి పోవాలంటే 22 కి.మీ దూరంలో ఉంది. దీంతో అనారోగ్యం బారిన పడిన భార్య సిధాలిని మోసుకుంటూ.. 65 ఏళ్ల ఆడ్ల్య పద్వి ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి తోడు రోడ్డు బ్లాక్ చేయడంతో అక్కడిదాకా ఎలా వెళ్లాలో తెలియక.. భార్యను తన భుజాలపై మోస్తూ కొండ మార్గంలో తీసుకెళ్లాడు. అయితే, కొండప్రాంతం కూడా దాటకుండానే.. కొద్ది దూరం వెళ్లేసరికే అతని భార్య, అతని భుజాల మీదనే తుదిశ్వాస విడిచింది. 

దీంతో ఏం చేయాలో పాలుపోక.. భార్య మృతదేహాం వద్దే ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. అటుగా వెడుతున్న ఓ గ్రామస్థుడు అతన్ని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతను దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా తీశాడు. 

మృతురాలు షిల్దిబాయి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బుధవారం, ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుండడంతో ఆమె భర్త ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

సంఘటన తర్వాత, జిల్లా పరిపాలన అధికారులు, స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కొండచరియలు, శిథిలాలను రోడ్డుపై నుండి తొలగించడం ప్రారంభించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది, కొండచరియలు విరిగిపడ్డాయి.

click me!