మధ్యప్రదేశ్‌లో విషాదం: విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

By narsimha lodeFirst Published Jul 11, 2021, 2:44 PM IST
Highlights


విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర మరణించారు.  ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. సెఫ్టిక్ ట్యాంకు శుభ్రం చేసిన తర్వాత నిర్మాణ వ్యర్థాలను  తీసే సమయంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. 

 భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్‌పూర్ జిల్లా బిజావర్ లో ట్యాంకు శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తో  ఒకే కుటుంబంలోని ఆరుగురు మరణించారు.మహువాఝలా గ్రామానికి చెందిన జగన్ అహిర్వార్ కుటుంబం ఇవాళ సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేస్తోంది. పని చేసే సమయంలో వెలుగు కోసం  సెప్టిక్ ట్యాంకులో  విద్యుత్ బల్బును ఏర్పాటు చేసుకొన్నారు. 

పని పూర్తైన తర్వాత  నిర్మాణ వ్యర్థాలను బయటకు తీసేందుకు జగన్ అహివార్ కొడుకు సెప్టిక్ ట్యాంకులోకి దిగాడు. ఈ సమయంలో అతను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు.  అతడిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు కుటుంబసభ్యులు కూడ విద్యుత్ షాక్ కు గురయ్యారు.  

ఈ ఘటనలో నరేంద్ర, రామ్ ప్రసాద్, విజయ్, లక్ష్మణ్, శంకర్ అహిర్వార్, మిలాన్ లు మరణించారు.ఒకే కుటుంబంలోని ఆరుగురు మరణించడంతో  గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకొన్నాయి. చనిపోయిన వారంతా 20 నుండి 65 ఏళ్లలోపు వారని గ్రామస్తులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!