రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నమస్కరించని ప్రధాని? ఆప్ నేత ట్వీట్‌పై ట్విట్టర్ అభ్యంతరం

Published : Jul 25, 2022, 02:17 AM IST
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నమస్కరించని ప్రధాని? ఆప్ నేత ట్వీట్‌పై ట్విట్టర్ అభ్యంతరం

సారాంశం

ఔట్ గోయింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోడీ ప్రతినమస్కారం చేయనట్టుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే, ఇది క్రాప్ వీడియో. ఈ వీడియోపై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది. కొందరు నెటిజన్లు పూర్తి నిడివి వీడియోను షేర్ చేశారు. అందులో ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు నమస్కరిస్తూ కనిపించారు.  

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ ఎదురుగా వస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతినమస్కారం చేయరు. కోవింద్ చేతులు జోడించి ముందుకు వచ్చినా.. ప్రధాని మోడీ పట్టించుకోనట్టుగా నిలబడి ఉంటారు. ఆ తర్వాత ముందుకు కదిలిపోతారు. ప్రధాని పక్కనే ఉన్న పియూష్ గోయల్ మాత్రం నమస్కరిస్తూనే ఉంటారు. ఈ వీడియో వైరల్ అయింది. రాష్ట్రపతిగా పదవీకాలం గడిచిన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నమస్కారం కూడా పెట్టట్లేదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే, ఈ వీడియోకు ట్విట్టర్ సంస్థ అభ్యంతరం తెలిపింది. ఈ వీడియో సందర్భానికి దూరంగా తీశారని పేర్కొంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎంతమాత్రం నమస్కారం తెలుపకుండా ప్రధాని మోడీ నిలబడ్డాడని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో అసందర్భంగా ఎత్తుకొచ్చిందని వాదించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ షేర్ చేసిన వీడియో కత్తిరించిన వీడియో అని, నిజానికి ఆ వీడియో ఇంకొంత పెద్దగా ఉండాలి. ఇంకొందరైతే సంజయ్ సింగ్ ట్వీట్ చేసిన పొట్టి వీడియోకు నిజమైన వీడియోను కలిపి పోస్టు చేశారు. 

ఔట్ గోయింగ్ ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌ను అవమాస్తూ ఆప్ నేత సంజయ్ సింగ్ దారుణంగా  వివరించారు. ఆ వీడియో ను క్రాప్ చేసి రామ్‌నాథ కోవింద్‌ను అగౌరవపరిచారని ఓ యూజర్ మండిపడ్డారు. అయితే, లాంగ్ వీడియో ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ.. ఔట్ గోయింగ్ ప్రెసిడెంట్‌కు నమస్కరిస్తూ కనిపించారు. కానీ, ఆప్ చేసిన ఎడిట్‌లో రాష్ట్రపతి రెండు చేతులు జోడించి కనిపించినా.. ప్రధాని ఖాతరు చేయనట్టుగా కనిపించారు. దీంతో ఆప్ నేత పోస్టు చేసిన క్రాప్ వీడియోను చాలా మంది విమర్శిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పార్లమెంటు ఆవరణలో వీడ్కోలు చెబుతున్నప్పటి వీడియోనే ఇది.

ఓ యూజర్ కామెంట్ వేస్తూ పూర్తి వీడయో చూపించండి అంకుల్ అని కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఈ క్రాప్ వీడియోను పోస్టు చేసిన వారిని లక్ష్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !