భారతీయ వరుడి దుస్తుల్లో ట్విట్టర్ బాస్ ఫొటో వైరల్... ఎలన్ మస్క్ ఏమన్నాడంటే...

Published : Jun 03, 2023, 01:10 PM IST
భారతీయ వరుడి దుస్తుల్లో ట్విట్టర్ బాస్ ఫొటో వైరల్... ఎలన్ మస్క్ ఏమన్నాడంటే...

సారాంశం

భారతీయ సంప్రదాయ వరుడి దుస్తుల్లో ఎలన్ మస్క్ ఉన్నట్టుగా ఏఐ ఓ ఫొటో సృష్టించింది. ఇది వైరల్ అవ్వడంతో మస్క్ దానికి స్పందించారు. 

ఢిల్లీ : ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కు చెందిన ఓ ఫొటో ఇండియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి ఎలన్ మస్క్ కూడా ‘నాకు ఇది బాగా నచ్చింది’ అంటూ రిప్లై కూడా ఇచ్చాడు. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే.. భారతీయ సంప్రదాయ వరుడి దుస్తుల్లో ఉన్న ఎలన్ మస్క్ ఫొటో అది. ఆయనెప్పుడు ఇలా తయారయ్యారు? అని ఆశ్చర్యపోతున్నారా? అది ఏఐతో సృష్టించిన ఫొటో.

వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్టైన ఓ వ్యక్తి  ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్‌ను దేశీ వరుడిగా ఊహిస్తూ.. ఆయన ఫొటోలను సృష్టించాడు. వీటిని  మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే పేజ్ లో షేర్ చేశఆడు. మిడ్‌జర్నీని ఉపయోగించి ఈ పోటోలు తయారు చేశారు. ఈ ఫొటోలో కస్తూరి షేర్వాణీ ధరించి, పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, గుర్రపు స్వారీ చేస్తూ ఎలన్ మస్క్ కనిపిస్తున్నాడు. 

ఈ ఫొటోలను ట్విట్టర్ లో డోగిడిజైనర్ అనే అకౌంట్ లో షేర్ చేశారు. అవి చూసిన ఎలన్ మస్క్ ‘ఐలవ్ ఇట్’ అంటూ స్పందించారు. నాలుగు రోజుల క్రితం ఈ పోస్ట్‌ను షేర్ చేయగా, వెంటనే అది వైరల్‌గా మారింది. నెటిజన్లు అతనిమీద.. అతని పనితనం మీద ప్రశంసలు కురిస్తున్నారు. ఎలోన్ మస్క్‌ను భారతీయ వరుడిగా చూసి థ్రిల్ అవుతున్నారు.

ఎలోన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి. ప్యారిస్ ట్రేడింగ్‌లో ఆర్నాల్ట్ ఎల్ విఎంహెచ్ షేర్లు 2.6శాతానికి పడిపోయాయి. దీంతో బుధవారం నాడు టెస్లా ఇంక్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లగ్జరీ టైకూన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు.

ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితా అయిన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మస్క్, 74 ఏళ్ల ఓ ఫ్రెంచ్ వ్యక్తి ఈ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు