ANI, NDTV లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ట్విటర్.. అకౌంట్ల బ్లాక్ ..  కారణం తెలిస్తే అవాక్కే ..

Published : Apr 29, 2023, 08:14 PM ISTUpdated : Apr 29, 2023, 08:17 PM IST
ANI, NDTV లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ట్విటర్.. అకౌంట్ల బ్లాక్ ..  కారణం తెలిస్తే అవాక్కే ..

సారాంశం

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI, వార్తా సంస్థ NDTV లకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఈ రెండు వార్త సంస్థలకు సంబంధించిన అధికారిక హ్యాండిల్‌ను బ్లాక్ చేసింది. పైగా ఓ వింత వివరణ ఇచ్చింది.  

ప్రముఖ వార్తా ఏజెన్సీ ANI , వార్తా సంస్థ NDTV లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఈ రెండు వార్త సంస్థలకు సంబంధించిన అధికారిక హ్యాండిల్‌ను బ్లాక్ చేసింది. పైగా ANI హ్యాండిల్‌ను బ్లాక్ చేయడానికి ఓ వింత కారణాన్ని చూపించింది. ఆ కారణం తెలిస్తే.. మీరు కూడా కచ్చితంగా అవాక్కవుతారు. ఈ  ఖాతాకు కనీస వయసు ప్రామాణికతను పాటించడం లేదని, దీంతో ఆపరేట్ చేయడానికి అర్హత లేదని పేర్కొంది. ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాష్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. పోస్ట్‌లో సమస్యను ఫ్లాగ్ చేశారు . అందులో ఎలోన్ మస్క్‌ను కూడా ట్యాగ్ చేశారు. 

 ANI Twitter ఖాతాకు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. భారతదేశపు అతిపెద్ద వార్తా సంస్థను లాక్ చేసి, ANI ఖాతా వయస్సు పరిమితుల క్రిందకు వస్తుందని, ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కనీసం 13 ఏళ్ల వయసుండాలనీ,  ANI పేజ్ తన రిక్వైర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా లేదని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ,  అందుకే మీ అకౌంట్‌ని లాక్ చేస్తున్నామని ట్విటర్ మెయిల్ లో పేర్కొంది.  

NDTV ఖాతా కూడా .. 

మరోవైపు,,  వార్తా సంస్థ NDTV తన హ్యాండిల్ బ్లాక్ చేయబడినట్టు పేర్కొంది. ఎన్డీటీవీ ట్విటర్ అకౌంట్ ఉనికిలో లేనట్టు చూపిస్తోంది. అయితే.. ఈ ఖాతాను ఎందుకు నిలిపివేశారో కారణం తెలియరాలేదు.  

ట్విట్టర్‌ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వారి ఖాతాలు ఎందుకు తొలిగించబడుతున్నాయో .. యూజర్లకు కూడా అర్థం కాకుండా పోయింది. ఇటీవల కొంతకాలం ట్విట్టర్ ఖాతా నుండి లెగసీ చెక్‌మార్క్‌ను తీసివేసింది. అయితే.. వెంటనే అది కొందరికి తిరిగి వచ్చింది. అలాగే.. బ్లూ చెక్‌మార్క్ కంపెనీ ఈ ప్రపంచంలో లేని కొన్ని ఖాతాలను కూడా ఉంచింది.  ట్విట్టర్‌లో ఇప్పటి వరకు పలు మార్పులు చేసాడు ఎలోన్ మస్క్. 

 

 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu