కవల సోదరుల్ని వివాహం చేసుకున్న కవల సోదరీమణులు... పశ్చిమ బెంగాల్ లో అరుదైన పెళ్లి...

By SumaBala BukkaFirst Published Dec 8, 2022, 10:51 AM IST
Highlights

కవల అక్కాచెల్లెళ్లు అర్పిత, పరమితలు.. కవల అన్నాదమ్ములైన లవ్, కుష్‌లను వివాహం చేసుకున్నారు. తూర్పు బుర్ద్వాన్‌లోని కుర్‌మున్ గ్రామంలో మంగళవారం ఈ చతుష్టయం వివాహం జరిగింది.

పశ్చిమ బెంగాల్ : ఇద్దరు కవల అమ్మాయిలు.. మరో ఇద్దరు కవల అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. కవలలు, కవలల్నే పెళ్లి చేసుకోవడం మన దగ్గర కాదు గానీ.. విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కథనంతోనే... పాతికేళ్ల క్రితం ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా ‘జీన్స్’ అనే సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 

పశ్చిమ బెంగాల్‌లో కవల వధువులు, కవల వరులను పెళ్లాడిన ఘటన తూర్పు బుర్ద్వాన్‌లోని కుర్‌మున్ గ్రామంలో ఈ వివాహం మంగళవారం జరిగింది. కవల సోదరీమణులు అర్పిత, పరమితలను కవల సోదరులు లవ్, కుష్‌లను వివాహం చేసుకున్నారు. అర్పిత, పరమితల ఇద్దరూ చిన్నప్పటినుంచి కలిసే పెరిగారు. ఆడుకున్నా, స్కూలుకు వెళ్లినా, కాలేజీకి వెళ్ళినా.. ఇద్దరూ ఒకరిని విడికి ఒకరు ఎప్పుడూ ఉండలేదు. వీరిద్దరి మధ్య చాలా బలమైన అనుబంధం ఉంది. అది పెళ్లితో దెబ్బతినొద్దని అనుకున్నారు. 

అందుకే వీరిద్దరూ కవలలనే పెళ్లి చేసుకోవాలని, ఒకేసారి వీరి వివాహాలు జరగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు సోదరీమణులు భాతర్ బాలికల పాఠశాలలో చదువుకున్నారు. ఒకే కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. ఈ కవల సోదరీమణులు అర్పిత, పరమితలు  కవల సోదరులతో వివాహం ద్వారా తమ కోరిక తీరిందని సంబరపడుతున్నారు.

హిమాచల్‌ ఫలితంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలను తరలించే యోచనలో కాంగ్రెస్.. రంగంలోకి ప్రియాంక..!

ఈ కవల వధువుో తండ్రి, గౌరచంద్ర సంత్రా, స్థానిక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పెళ్లి విషయంలో అమ్మాయిల కోరిక గురించి తెలుసుకున్న అతను.. వారి కోరికను గౌరవించాడు. అలాగే వరుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే కుర్మున్ గ్రామానికి చెందిన లువ్ పక్రే, కుష్ పక్రే లు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వారు కూడా కవలలే అని, వారి కుటుంబ సభ్యులు కూడా వధువుల కోసం వెతుకుతున్నారని తెలిసింది. దీంతో అమ్మాయిల తండ్రి వారిని సంప్రదించాడు. అతను చెప్పింది విన్న తరువాత వధువు తండ్రితో మాట్లాడి.. అమ్మాయిల కోరిక మేరకు కవల అబ్బాయిలతోనే వివాహాన్ని నిశ్చయించాడు. 

అలా కవల సోదరీమణులు అర్పిత, పరమితల వివాహం కవల సోదరులు లవ్, కుష్‌లతో జరిగింది. కవల సోదరులైన లవ్, కుష్ లు ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. వారుకూడా తమకు కాబోయే భార్యలు కవలలు అయితే బాగుండు అని అనుకున్నారు. అలాంటి వారి కోసమే వెతుకుతున్నారు. అర్పిత,  పర్మిత సంబంధం వచ్చినప్పుడు, వారు వెంటనే ఒకే చెప్పేశారు. దీంతో వీరి వివాహం డిసెంబర్ 5 సోమవారం నాడు జరిగింది.

పెళ్లిలో వీరిద్దరూ ధరించిన దుస్తులు కూడా ఒకేలాగా ఉన్నాయి. పెళ్లి సమయంలో, వరులిద్దరూ బ్లూ కలర్ పంజాబీ సూట్స్  ధరించి కనిపించారు. మరోవైపు, కవల సోదరీమణులు అర్పిత, పర్మితల చీరల రంగు, నగల డిజైన్, దుస్తులు అన్నీ సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి. బుర్ద్వాన్‌లో జరిగిన ఈ కవల జంట వివాహ అరుదైన ఘట్టమని.. ఈ పెళ్లికి హాజరైనవారు అందరూ అంటున్నారు. 
 

click me!