కలియుగ ‘వాలి’ : తమ్ముడి భార్య మీద అన్న కన్ను.. కవలలు కావడంతో ఆరునెలలుగా అడ్వాంటేజ్.. చివరికి...

Published : May 23, 2022, 09:40 AM IST
కలియుగ ‘వాలి’ : తమ్ముడి భార్య మీద అన్న కన్ను.. కవలలు కావడంతో ఆరునెలలుగా అడ్వాంటేజ్.. చివరికి...

సారాంశం

మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా కలిసిపుట్టిన సోదరుడి భార్యమీదే కన్నేశాడో కవల అన్న. ఆరునెలలుగా తమ్ముడిలా ఆమెతో సంసారం కూడా చేశాడు. చివరికి విషయం వెలుగులోకి రావడంతో.. 

మహారాష్ట్ర : అజిత్ హీరోగా వచ్చిన ‘వాలి’ సినిమా గుర్తుందా? తమ్ముడి భార్య మీద కన్నేసి.. ఆమెను లోబర్చుకునే క్రమంలో సాగుతుంది సినిమా. రామాయణంలోని వాలి, సుగ్రీవుల కథనే కాస్త అటూ, ఇటూగా మార్చి కమర్షియలైజ్ చేశారనుకోండీ.. అయితే అలాంటి కథ ఇప్పుడు నిజంగా జరిగింది. ఓ అన్న కవలసోదరులు కావడం అనే అంశాన్ని అలుసుగా తీసుకుని.. తమ్ముడి భార్యను ఆరునెలలుగా వాడుకుంటున్నాడు. చివరికి మరదలికి అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఇది మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే..  

తమ్ముడి భార్యమీద కన్నేసిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కవలలు కావడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న అన్న.. మరదలిమీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకే రూపంతో ఉన్న అతడి విషయంలో మోసపోయిన ఆమె.. విషయం భర్తకు చెప్పడంతో అతడు సమాధానం విని షాకైంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబంలో ఇద్దరు కవల సోదరులు ఉన్నారు. 

వారిని ఎవరు అన గుర్తించడమే పేరెంట్స్ కే కొన్నిసార్లు సాధ్యపడేది కాదు. ఇదిలా ఉండగా.. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల జంటకోసం వెతికారు. అలా దొరక్కపోవడంతో ఎవరో ఒకరికి పెల్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులు గడిచాక.. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. 

ఇప్పటివరకు అంతా బాగానే సాగిన వ్యవహారం.. ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఓ సమయంలో అత్తారింటికి కాపురానికి వచ్చిన మరదలిమీద.. అన్న కన్నేశాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండడం కూడా అతడికి బాగా కలిసివచ్చింది. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసకుని అతనిలా గదిలోకి దూరి మరదలితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే కదా అనే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పలేదు. 

ఇలా ఆరునెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా.. ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో అసలు విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని వెంటనే తన భర్త, అత్తామామలకు చెప్పేసింది. ఈ క్రమంలో భర్తతో సహా కుటుంబ సభ్యులందరూ అన్నకే మద్దలిచ్చారు. విషయం బైటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. 

వారి బెదిరింపులు లెక్కచేయని బాధితురాలు.. తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కవల సోదరుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu