గన్ తలకు గురిపెట్టి... యువతిపై అత్యాచారం...!

Published : May 23, 2022, 09:32 AM IST
 గన్ తలకు గురిపెట్టి... యువతిపై అత్యాచారం...!

సారాంశం

బెంగళూరు నగరంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఆమె తన చదువును పూర్తి చేస్తోంది. కాగా... ఆమెను ఓ వ్యాపారి తుపాకీతో  బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఏప్రిల్ 11వ తేదీన చోటుచేసుకోగా.. ఇటీవల వెలుగులోకి రావడం గమనార్హం.

ఓ వ్యాపారవేత్త తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుపాకీతో  బెదిరించి మరీ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ 20ఏళ్ల యువతి.. బెంగళూరులో బీఏ చదువుతోంది. కాగా.. బెంగళూరు నగరంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఆమె తన చదువును పూర్తి చేస్తోంది. కాగా... ఆమెను ఓ వ్యాపారి తుపాకీతో  బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఏప్రిల్ 11వ తేదీన చోటుచేసుకోగా.. ఇటీవల వెలుగులోకి రావడం గమనార్హం.

నిందితుడు బిహార్ కి చెందిన వాడు కాగా... బెంగళూరులో స్థిరపడ్డాడు. టైల్ వ్యాపారం చేస్తున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కాగా.. సదరు వ్యాపారి ఇంట్లోనే బాధితురాలు అద్దెకు నివసిస్తోంది. అయితే.. ఆమె కోసం ఎవరైనా స్నేహితులు ఇంటికి వస్తే ఆమెపై ఈ వ్యాపారి గొడవ పడేవాడు. ఎవరూ రావద్దని ఆంక్షలు విధించేవాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి కూడా బెదిరించేవాడు.

కాగా.. ఏప్రిల్ నెలలో సదరు యువతిని కలిసేందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడకు వచ్చాడు. వెంటనే.. అతనిని బెదిరించి.. అతని బైక్ కీ లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ తర్వాత.. యువతిని ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెబుతానని బెదిరించాడు. అలా చేయవద్దని.. తన తల్లిదండ్రులు బాధపడతారని.. యువతి సదరు వ్యాపారిని వేడుకుంది.

ఆ తర్వాత.. యువతి.. ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారి కోపంతో రగలిపోయాడు. ఏప్రిల్ 11వ తేది రాత్రి   తన వద్ద ఉన్న   లైసెన్స్ తుపాకీతో ఆమె ఉంటున్న గదిలోకి ప్రవేశించిన అతను... చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా.. బాధితురాలు ఇటీవల ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రిజల్ట్ రావాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu