భర్త మృతి: కొడుకును చంపి ఆత్మాహత్యాయత్నం చేసిన వివాహిత

Published : Jun 02, 2018, 04:16 PM IST
భర్త మృతి: కొడుకును చంపి ఆత్మాహత్యాయత్నం చేసిన   వివాహిత

సారాంశం

భర్త మృతితో కొడుకును చంపి ఆత్మహత్యాయత్నం

బెంగుళూరు:రోడ్డుప్రమాదంలో భర్త మరణించడంతో
తట్టుకోలేక కొడుకును చంపి ఓ తాను కూడ
ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ వివాహిత. అయితే
చివరినిమిషంలో కుటుంబసభ్యులు గమనించడంతో
వివాహిత చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స
పొందుతోంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో
చోటు చేసుకొంది.

కర్ణాటకలోని ఓ ప్రముఖ చానెల్ లో యాంకర్ గా పనిచేసే
చందన్ రోడ్డు ప్రమాదంలో వారం రోజుల క్రితం మృతి
చెందాడు.ఆయనకు భార్య మీనా, 13 ఏళ్ళ కొడుకు తుషార్
ఉన్నాడు. తుషార్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి
చదువుతున్నాడు.


భర్త మృతి చెందడంతో మీనా ఆ షాక్‌ నుండి తేరుకోలేదు.
అమితంగా ప్రేమించే భర్త  మృతి చెందడంతో మీనా
ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

ఉదయం పూట ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 13
ఏళ్ళ కొడుకు తుషార్ గొంతుకోసి చంపేసింది. ఆ తర్వాత
బాత్‌రూమ్ లోని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి
ప్రయత్నించింది. 

కొడుకు మృతదేహన్ని పట్టుకొని స్పృహ కోల్పోయిన మీనాను
 అప్పుడే ఇంట్లోకి వచ్చిన సురేష్ గమనించాడు. ఇద్దరిని
ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తుషార్
చనిపోయాడు. మీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు
చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?