అఫైర్: టీవీ నటి భర్త ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య

pratap reddy   | Asianet News
Published : Dec 28, 2019, 01:46 PM IST
అఫైర్:  టీవీ నటి భర్త ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య

సారాంశం

టీవీ నటి రేఖ భర్త గోపీనాథ్ పెరంబూరులోని తన కార్యాలయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మహిళతో అఫైర్ పెట్టుకున్న గోపీనాథ్ తరుచుగా భార్య రేఖతో గొడవపడుతున్నట్లు తెలుస్తోంది.

చెన్నై: టీవీ నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబూరలో జరిిగంది. పెరంబూరు నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) అనే వ్యక్తి అన్నా నగర్ టీవీఎస్ కాలనీలోని ఓ ప్రైవేట్ ప్రచారం సంస్థలో కార్యనిర్వాకుడిగా పనిచేస్తున్నడాు. 

గోపీనాథ్ భార్య రేఖ టీవీ నటి. వ్యాఖ్యత కూడా. గురువారం ఉదయం గోపీనాథ్ పనిచేస్తున్న కార్యాలయాన్ని తెరవడానికి కార్మికులు వచ్చారు. వారు లోనికి వెళ్లే సమయంలో గోపీనాథ్ గదిలో గదిలో ఉరేసుకుని కనిపించాడు. జేజే నగర్ పోలీసులు మృతదేహాన్ని కీల్ పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిం్చారు. 

భార్య రేఖతో గొడవ వల్లనే గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గోపినాథ్ పదేళ్ల క్రితం రేఖను ప్రేమించి పెళ్లాడాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేఖ ఓ ప్రైవేట్ టీవీ చానెల్ లో పనిచేస్తోంది.

ఆరు నెలల క్రితం గోపినాథ్ జేజే నగర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అదే సంస్థలో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రేఖకు, గోపీనాథ్ కు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. 

గురువారంనాడు కూడా భార్య రేఖతో గొడవ పడి తన కార్యాలయానికి వెళ్లిన గోపీనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పుల బాధను కూడా అతను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !