బుల్లి తెర నటిపై ప్రేమోన్మాది దాడి.. కంగనా సపోర్ట్ కోరిన తార..

By AN TeluguFirst Published Oct 28, 2020, 11:25 AM IST
Highlights


టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై పెళ్ళికి నిరాకరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ దాడిలో మాల్వీ మల్హోత్రా తీవ్ర గాయలపాలై ప్రస్తుతం ముంబైలోకి కొకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
 

టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై పెళ్ళికి నిరాకరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ దాడిలో మాల్వీ మల్హోత్రా తీవ్ర గాయలపాలై ప్రస్తుతం ముంబైలోకి కొకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మాల్వీ ఇలా జరుగుతుందని తను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తనకు ఈ విషయంలో సపోర్ట్ చేయాలని కోరింది.

ముంబైలో తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. తనుకూడా కంగనా స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్ లోని మాండి నుండే వచ్చానని చెప్పుకొచ్చింది.

హిందీలో పలు టీవీ సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాల్వి మల్హోత్రా. ఈమెకు ఫేస్‌బుక్ వేదికగా కుమార్ మహిపాల్ సింగ్ అనే అతను పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని అలుసుగా తీసుకొని అతను కొన్ని రోజులుగా మాల్వీని సామాజిక మాధ్యమాల వేదికగా పెళ్లి చేసుకోమంటూ వేధిస్తున్నాడు. అయితే మాల్వీ మాత్రం అతని ప్రేమను తిరస్కరించింది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను అదును చూసి ఆమె పై సోమవారం రాత్రి కత్తితో దాడి చేసాడు. 

మాల్వీ మల్హోత్రా సోమవారం ఓ షూటింగ్ ముగించుకొని ముంబాయి వెర్సోవా ప్రాంతంలో ఓ కేఫ్ నుంచి ఆమె ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయాల పాలైన ఆమెను కోకిలబెన్ అంబానీ  హాస్పిటల్‌కు తరిలించారు. పోలీసులు అక్కడ సీసీ టీవీ కెమెరా ఫుటేష్ ఆధారంగా ఆమెపై దాడికి పాల్పడింది కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి అని నిర్ధారించారు. ఇతను కూడా చిత్ర పరిశ్రమలో ఓ ప్రొడ్యూసర్ అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుమార్ మహిపాల్ సింగ్.. సదురు మాల్వీ మల్హోత్రాను కారులోంచి చూసి ఆమెను అడ్డడించాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని ఆమెతో వాదనకు దిగాడు. ఆ తర్వాత మాట మాట పెరగడంతో కోపంతో అప్పటికే రగిలిపోయిన అతను .. మాల్వీపై పొట్టలో చేతులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అతనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 హత్నాయత్నం, నిర్భయ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

click me!