వచేస్తున్నానంటూ హిందీ లో ట్రంప్ ట్వీట్.... భారత్ ఎదురుచూస్తోందన్న మోడీ

By telugu teamFirst Published Feb 24, 2020, 10:51 AM IST
Highlights

గంటలో ట్రంప్ అహ్మదాబాద్ లో దిగుతారు అనగా... ట్రంప్ హిందీ లో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. భారత్ చేరుకునే దారిలో నే ఉన్నామని....మరికొద్దిసేపట్లో అందరి కలుస్తానని అన్నాడు. ట్రంప్ ఇలా హిందీలో ట్వీట్ చేయడంతో ట్విట్టర్ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మరికొద్దిసేపట్లో భారత్ చేరుకోనున్నారు. ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంక, జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందంతో భారత్ లో దిగనున్న విషయం తెలిసిందే. 

ఆయన నేరుగా వాషింగ్టన్ నుండి బయల్దేరి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతారు. 

మరొక గంటలో ట్రంప్ అహ్మదాబాద్ లో దిగుతారు అనగా... ట్రంప్ హిందీ లో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. భారత్ చేరుకునే దారిలో నే ఉన్నామని.... మరికొద్దిసేపట్లో అందరి కలుస్తానని అన్నాడు. ట్రంప్ ఇలా హిందీలో ట్వీట్ చేయడంతో ట్విట్టర్ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. 

हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते में हैँ, कुछ ही घंटों में हम सबसे मिलेंगे!

— Donald J. Trump (@realDonaldTrump)

నిన్న రాత్రి ట్రంప్ వాషింగ్టన్ నుండి ఆయన ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ లో భారత్ కి పయనమయ్యారు. దాదాపుగా 20 గంటల ప్రయాణం అనంతరం ఆయన నేటి ఉదయం 11. గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగుతారు. 

ఆయన అక్కడి నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి అక్కడ అల్పాహారాన్ని సేవిస్తారు. అక్కడ అల్పాహార ఏర్పాట్లలో ఇప్పటికే చెఫ్ బృందం తలమునకలై ఉంది. మాంసాహారం అధికంగా తినే ట్రంప్ ఇప్పుడు కేవలం వెజ్ మాత్రమే తినబోతున్నారు. 

ట్రంప్ రాక కోసం ఇప్పటికే అహ్మదాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేసారు. ట్రంప్ అహ్మదాబాద్ లో ఉండే మూడు గంటల కోసం దాదాపుగా 85 కోట్ల రూపాయలను వెచ్చించారు.

ట్రంప్, మోడీలు విమానాశ్రయం నుంచే మొతేరా క్రికెట్ స్టేడియం కి వెళ్లే దారిలో ఉండే మురికివాడల ప్రాంతంలో 4 అడుగుల గోడను మునిసిపల్ అధికారులు నిర్మించారు. 

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ట్రంప్, మోడీ లు వెళ్లే దారిలో ఉండే మురికివాడలను దాచేయడానికే ఇలా గోడను కట్టారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం ఇది గతంలో ట్రంప్ పర్యటన ఖరారు కాకముందే తీసుకున్న నిర్ణయమని, ఫుట్ పాత్ ను కబ్జాలకు గురికానీయకుండా ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు. 

ప్రపంచంలో అతిపెద్దదైన మొతేరా క్రికెట్ స్టేడియం లో ట్రంప్ మోడీ తో కలిసి నమస్తే ట్రంప్ అనే కార్యక్రమంలో ఉపన్యసిస్తారు. 

click me!