ట్రంప్ కి ఓన్లీ వెజ్! అల్పాహారం లో ఖమన్... ఈ వంటకం ప్రత్యేకతేమిటి?

By telugu teamFirst Published Feb 24, 2020, 10:34 AM IST
Highlights

అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ లో నిన్న వాషింగ్టన్ నుండి బయల్దేరిన ట్రంప్.... నేరుగా అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుండి ఆయన ప్రధాని మోడీతో కలిసి సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న 12 గంటల 15 నిముషాలకు అల్పాహారం సేవిస్తారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందంతో ట్రంప్ నేటి ఉదయం 11గంటలకు అహ్మదాబాద్ లో దిగనున్న విషయం తెలిసిందే. 

తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ లో నిన్న వాషింగ్టన్ నుండి బయల్దేరిన ట్రంప్.... నేరుగా అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుండి ఆయన ప్రధాని మోడీతో కలిసి సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న 12 గంటల 15 నిముషాలకు అల్పాహారం సేవిస్తారు. 

నిత్యం మాంసాహారం భుజించే ట్రంప్ కి మాత్రం దాదాపుగా పూర్తి శాఖాహారాన్నే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. నేటి ఉదయం అల్పాహారంలో ట్రంప్ కోసం ఖమన్ తో పాటుగా బ్రోకలీ సమోసా, కార్న్ సమోసా లను అందించనున్నట్టు ఈ అల్పాహార ఏర్పాట్లను పరిశీలిస్తున్న చెఫ్ సురేష్ ఖన్నా తెలిపారు. 

ఖమన్ తోపాటుగా ఆపిల్ ఫై, కాజు కత్లిలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెఫ్ తెలిపారు. ట్రంప్ ఎక్కువ ఘాటయిన వంటకాలను తినరు కాబట్టి మసాలాలు చాలా లైట్ గా ఉంచనున్నట్టు తెలిపారు. 

ఖమన్ అనే పేరు వినగానే ఇదేదో అర్థం కానీ వంటకంగా అనిపించినప్పటికీ... ఇది మనందరికీ ఎంతో సుపరిచితమైన గుజరాతీ ఫేమస్ వంటకం ఢోక్లా లాంటిదే. దీన్నే మాములుగా ఖమన్ ఢోక్లా అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఢోక్లాను శెనగ పిండి, బియ్యం పిండి కలిపిన మిశ్రమంతో తాయారు చేస్తే.... దీన్ని మాత్రం కేవలం శనగపిండితో మాత్రమే తాయారు చేస్తారు. 

ఇలా ఈ ప్రత్యేకమైన గుజరాతీ వంటకాన్ని ఆవిరి మీద ఉడికించి తరువాత తాలింపును దీనికి జత చేస్తారు. ఈ ప్రత్యేకమైన వంటకాలను ట్రంప్ కి రుచి చూపించేందుకు ఫార్చ్యూన్ ల్యాండ్ మార్క్ హోటల్ కి చెందిన బృందం చెఫ్ సురేష్ ఖన్నా నేతృత్వంలో గత కొన్ని రోజులుగా సన్నాహకాలు చేస్తున్నారు. 

ఫుడ్ తొలుత ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ చేసిన తరువాత ఇంకా మరికొన్ని సార్లు ఇన్స్పెక్షన్ అయిన తరువాత అతిథులకు అందిస్తామని ఆయన తెలిపారు. ట్రంప్ దాదాపుగా ఒక మూడు గంటలు గుజరాత్ లో సమయం వెచ్చించిన తరువాత అక్కడి నుండి నేరుగా అగ్ర బయల్దేరివెళ్తారు. 

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తరువాత ఆయన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ స్టేడియం... మొతేరాలో మోడీతో కలిసి నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొంటారు. అక్కడ తాజ్ మహల్ అందాలను చూసి నేరుగా రేపటి కార్యక్రమాల కోసం  ఢిల్లీ చేరుకుంటారు. 

click me!