ట్రంప్ డే 2 మినిట్ తో మినిట్ షెడ్యూల్: ఫుల్ బిజీ బిజీ

By telugu teamFirst Published Feb 25, 2020, 11:26 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడి రెండవ రోజు షెడ్యూల్ చాలా బిజీ బిజీగా ఉండనుంది.  మేలేనియ కూడా ఈరోజు బిజీగా ఉండనున్నారు

అమెరికా అధ్యక్షుడి రెండవ రోజు షెడ్యూల్ చాలా బిజీ బిజీగా ఉండనుంది.  మేలేనియ కూడా ఈరోజు బిజీగా ఉండనున్నారు. నేటి ఉదయం ఇప్పటికే గార్డ్ అఫ్ హానర్ ని రాస్ద్ట్రపతి భవన్ వద్ద స్వీకరించిన ట్రంప్ అక్కడి నుండి నేరుగా రాజ్ ఘాట్ బయల్దేరి వెళ్లారు. అక్కడ మహాత్ముని సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తరువాత అధ్యక్ష దంపతులు అక్కడ మొక్కను నాటారు. 

ఇప్పుడే ఉదయం 11.15 ప్రాంతంలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. అక్కడ ఫోటో సెషన్స్ అయిపోయిన తరువాత ఇరువురు కొద్దిసేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు మధ్య ఆంతరంగిక చర్చలు జరిపిన తరువాత ఇరు దేశాలకు చెందిన బృందాలు సదరు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు చేస్తారు. 

ఈ చర్చలు జరుగుతున్న తరుణంలో ఫస్ట్ లేడీ మెలేనియ ట్రంప్ ఢిల్లీలోని విద్య విధానం ఎలా ఉందొ అధ్యయనం చేయడానికి ఢిల్లీలోని ఒక పాఠశాలను సందర్శిస్తారు. 

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ట్రంప్ కోసం భారత సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశాన్ని మోడీ నిర్వహించనున్నారు. ఇందులో ముఖేశ్ అంబానీ, రతన్ తారలతో సహా చాలామంది బిజినెస్ ప్రముఖులు పాల్గొననున్నారు. 

సాయంత్రం 5 గంటలకు ట్రంప్, మోడీలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తారు. ఈ ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తరువాత ట్రంప్ కూడా వేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 

రాత్రి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భావం లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని అక్కడి నుండి నేరుగా ఎయిర్ ఫోర్స్ వన్ లో తిరిగి అమెరికా ప్రయాణమవుతారు. 20 గంటల ప్రయాణం అనంతరం ఆయన వాషింగ్టన్ చేరుకుంటారు. 

click me!