ఢిల్లీలో అల్లర్లు, లూటీలు: 7కు చేరిన మృతుల సంఖ్య, మరోసారి షా భేటీ

By telugu teamFirst Published Feb 25, 2020, 11:06 AM IST
Highlights

ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండోసారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసలో మరణించినవారి సంఖ్య 7కు చేరింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలో ఓ పోలీసు సహా ఏడుగురు మరణించారు. అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారంనాడు మరోసారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

ఈ రిక్షాలో ప్రయాణిస్తున్నవారిపై దాడి చేసి, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హింసకు సంబంధించిన సమాచారం తెలియజేస్తూ తమకు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

సోమవారం రాత్రి గోకుల్ పురిలోని టైర్ మార్కెట్ కు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. జఫ్రాబాద్, మౌజాపూర్ - బాబర్ పూర్, గోకుల్ పురి, జోహ్రీ ఎంక్లేవ్, శివవిహార్ స్టేషన్లలో ఢిల్లీ మెట్రో రైళ్ల రాకపోకలను ఆపేశారు. 

ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికే కార్యక్రమానికి దూరమయ్యారు. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఇరు వర్గాలు ఘర్షణలకు దిగడంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

వాహనాలను, దుకాణాలను తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో ఓ పోలీసు కూడా మరణించాడు అల్లర్లలో ఐదుగురు మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. దాదాపు 100 మంది సోమవారం జరిగిన అల్లర్లలో గాయపడ్డారు. దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రుల్లో చేర్చారు. 

ఢిల్లీ పోలీసు చీఫ్, కేందర్ హోం శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఇంజన్ కు నిప్పటించడంతో ఫైర్ ఫైటర్స్ కూడా గాయపడ్డారు. ట్రంప్ దేశరాజధాని ఢిల్లీకి కొద్ది సేపట్లో చేరుకుంటారని అనగా హింస పెచ్చరిల్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో అమిత్ ట్రంప్ నకు స్వాగతం పలికే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. మంగళవారం ప్రభత్వ, ప్రైవేట్ కళాశాలలకు సెలవు ప్రకటించారు. 

డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ లో మంగళవారం ఉదయం సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనికి దూరంగా ఉన్నారు.

ట్రంప్ పర్యటన నేపథ్యంలో కొన్ని దుష్టశక్తులు హింసకు పూనుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్ారు. అల్లర్లకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు

click me!