గులాం నబీ ఆజాద్‌కి వీడ్కోలు: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

By narsimha lode  |  First Published Feb 9, 2021, 11:18 AM IST

 రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యాడు. 


న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యాడు. మంళవారం నాడు రాజ్యసభ నుండి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిటైర్ కానున్నారు. దీంతో ఆయన సేవలను పలువురు కొనియాడారు.

ఆజాద్ చేసిన సేవల గురించి ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  అధికారంలో ఉన్నా లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని ఆయన చెప్పారు. ఆజాద్ దేశానికి సేవలు చిరస్మరణీయమైనవన్నారు. ఆజాద్ కు ఆయన సెల్యూట్ చేశారు.

Latest Videos

undefined

ఆజాద్ ఎందరో ఎంపీలకు ఆదర్శమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆజాద్ కు మోడీ సెల్యూట్ చేశారు. ఆజాద్ ను తాను నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నట్టుగా ప్రధాని చెప్పారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడ మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

ఉగ్రవాదుల దాడి కారణంగా గుజరాత్ నుండి వచ్చిన ప్రజలు కాశ్మీర్ లో చిక్కుకొన్న సమయంలో ఆజాద్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆజాద్ తనకు చాలా ఏళ్లుగా తెలుసునని చెప్పారు. మేమిద్దరం చాలా కాలం ముఖ్యమంత్రులుగా పనిచేశామన్నారు. అంతేకాదు రాజకీయాల్లో కూడ చాలా ఏళ్లుగా ఉన్నామన్నారు. తాను సీఎం కావడానికి ముందు ఆజాద్ తో మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.

click me!