ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొట్టిన ట్రక్కు: 18 మంది దుర్మరణం

Published : Jul 28, 2021, 07:28 AM ISTUpdated : Jul 28, 2021, 08:36 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొట్టిన ట్రక్కు: 18 మంది దుర్మరణం

సారాంశం

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో మంగళవారం రాత్రి ఆ ప్రమాదం సంభించింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారబంకిలోని సనేహి ఘాట్ సమీపంలో బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు. 

మృతదేహాలు బస్సు కింద చిక్కుకున్నాయి. వాటిని తీయడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. బస్సు ముందు నిద్రపోతున్నవారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో వారు మరణించారు. వారంతా బీహార్ కు చెందిన కూలీలు. లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది.

హర్యానా నుంచి తిరిగి వస్తుండగా బస్సు నిలిచిపోయింది. దాంతో బస్సు ముందు వారు నిద్రకు ఉపక్రమించారు. బస్సును ట్రక్కు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కూలీలు ఆ బస్సు కింద నలిగిపోయారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !