హైదరాబాదు నుంచి ఆగ్రాకు, ట్రక్కు బోల్తా: ఐదుగురు వలస కూలీల దుర్మరణం

By telugu team  |  First Published May 10, 2020, 8:22 AM IST

హైదరాబాదు నుంచి మామిడికాయల లోడ్ ట్రక్కులో తమ స్వస్థలాలకు బయలుదేరిన వలస కూలీలు మధ్యప్రదేశ్ లో ప్రమాదానికి గురయ్యారు. ట్రక్కు బోల్తా పడడంతో ఐదుగురు మరణించారు.


భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధానికి భోపాల్ కు 200 కిలోమీటర్ల దూరంలో గల ఓ గ్రామంలో గత రాత్రి ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మరణించగా, 15 మంది గాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 18 మంది కూలీలు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు వెళ్లడానికి మామిడికాయలతో బయలుదేరిన ట్రక్కులో ఎక్కారు. ట్రక్కు నార్సింగ్ పూర్ వద్ద బోల్తా పడింది. గాయయపడినవారిని ఆస్పత్రుల్లో చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

Latest Videos

వలసకూలీలు తమ స్వగ్రామాలకు బయలుదేరి రైల్వే పట్టాలపై మృత్యువాత పడిన ఘటనను మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు రావడంతో పట్టాలపై 16 మంది వలస కూలీలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

మామిడికాయలను తీసుకుని లారీ హైదరాబాదు నుంచి ఆగ్రా బయలు దేరింది. ఆ ట్రక్కులో వలస కూలీలు ఎక్కారు. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లతో పాటు 18 మంది వలస కూలీలు ట్రక్కులో ఉన్నారు. 

ఇదిలావుంటే, భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మరణాలు 2 వేలకు చేరువగా వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 59,662 నమోదయ్యాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్య 1,981కి చేరుకుంది.

ఇప్పటి వరకు కోరనా వ్యాధి నుంచి 17,846 మంది కోలుకున్నారు. దాంతో యాక్టవ్ కేసుల సంఖ్య 39,834 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3320 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 95 మరణాలు సంభవించాయి.

గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 3 వేలకుపైగానే కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 216 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 19,089కి చేరుకుంది. శుక్రవారంనాడు కొత్దగా 1,089 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37 మదంి మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 731కి చేరుకుంది.

click me!