రూ.500 నోట్ల కట్టలు తరలిస్తున్న ట్రక్కు దగ్ధం: కాలిన నగదు

Published : Apr 22, 2019, 06:28 PM IST
రూ.500 నోట్ల కట్టలు తరలిస్తున్న ట్రక్కు దగ్ధం: కాలిన నగదు

సారాంశం

డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలు అంటుకోవడంతో  కోట్లాది రూపాయాల నోట్లు  కాలి బూడిదగా మారాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.  


శ్రీనగర్: డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలు అంటుకోవడంతో  కోట్లాది రూపాయాల నోట్లు  కాలి బూడిదగా మారాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

జమ్మూ కాశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లా ఖాజిగంద్ ప్రాంతంలోని పంజాత్‌లో సోమవారం తెల్లవారుజామున మధ్య రాత్రి  ఘటన చోటు చేసుకొంది. లోకల్ టీవీ చానెళ్లలో ఈ విషయం ప్రసారమైంది. కోట్లాది రూపాయాల నోట్ల కట్టలను తరలిస్తున్న ట్రక్కు దగ్దం కావడం చర్చనీయాంశంగా మారింది.

ట్రక్కులో రూ. 500 నోట్ల కట్టలున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  ఎన్నికల సంఘం దృష్టికి పోలీసులు ఈ ఘటనను తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు.

PREV
click me!

Recommended Stories

Vande Mataram Bill: వందేమాతరం పాడేప్పుడు ఈ తప్పులు చేస్తే.. జైలుకు వెళ్లాల్సిందే.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో గోనె సంచుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం