యోగి సీఎం అయ్యాక గడ్డం తీస్తానంటూ ప్రతిజ్ఞ..!

Published : Mar 12, 2022, 11:32 AM ISTUpdated : Mar 12, 2022, 11:37 AM IST
యోగి సీఎం అయ్యాక గడ్డం తీస్తానంటూ ప్రతిజ్ఞ..!

సారాంశం

అయితే పార్టీకి మద్దతివ్వడం కోసం కాకుండా తన పరిమితులపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికే ఆయన ఈ ప్రతిజ్ఞ చేయడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. మళ్లీ బీజేపీ అధికారంలో రాదని.. అది అక్కడ సెంటిమెంట్ అని అందరూ అనుకున్నారు. కానీ.. ఊహించని మెజార్టీతో..  బీజేపీ విజయం సాధించింది.  అయితే.. బీజేపీ విజయం తర్వాత...  యూపీలో.. వింత వింత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  యోగి ఆదిత్య నాథ్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ.. ఓ వ్యక్తి శపథం చేశాడట. ఆయన మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే వరకు  తాను గడ్డం తీయనంటూ శపథం చేయడం గమనార్హం. గతంలో.. ప్రధాని నరేంద్రమోదీ కోసం ఇలానే శపథం చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...  షాజహాన్‌పూర్ నివాసి రాజారామ్ యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి పెద్ద తీర్మానం చేశారు. యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీయించుకుంటానని శపథం చేశాడు. అయితే పార్టీకి మద్దతివ్వడం కోసం కాకుండా తన పరిమితులపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికే ఆయన ఈ ప్రతిజ్ఞ చేయడం గమనార్హం.

సదర్ బజార్ ప్రాంతంలో నివాసం ఉండే  మొహల్లా ఝండా కలాన్‌కు చెందిన రాజారామ్.. గతంలొ  నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయిన తర్వాత గడ్డం, తల వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీయించుకుంటానని చెప్పాడు.

యోగి ముఖ్యమంత్రి అయితే ఆయన దయనీయ స్థితిని చూసి ప్రభుత్వం కరుణించి ఇళ్లు, పింఛన్‌ తదితర ప్రయోజనాలను అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కటిక పేద కుటుంబానికి చెందిన రాజారాం చెప్పులు కుట్టే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు ఉన్నారు, వారిలో పెద్ద కుమారుడు దీపు దివ్యాంగుడు. అందుకే వృద్ధాప్యం తనను తాను శాసించినా వికలాంగుడైన కొడుకుకు ఆసరాగా నిలుస్తున్నాడు.

రాజారాం చిన్న కొడుకు ప్రదీప్ పంజాబ్‌లో కష్టపడి పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు పంపిస్తున్న కాస్త డబ్బు తోనే  తండ్రీకొడుకుల బతుకుదెరువు సాగుతోంది, కానీ రాజారాం కి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది అందలేదు. ఇప్పటి వరకు తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని అతను చెప్పాడు. కనీసం ఇప్పుడైనా తనను గుర్తించి.. తనకు సహాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu