
కర్ణాటక ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో వున్న ఏకైక రాష్ట్రం కావడం, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుండటంతో విశ్లేషకులు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, లింగాయత్ వర్గంలో అసంతృప్తులు, పార్టీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో బీజేపీ ఎన్నికలను ఎదుర్కోనుంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ తన అసంతృప్తిని బయటపెట్టారు. తనకు ఎంతో పాపులారిటీ వుందని, పోటీ చేసిన ఏ ఎన్నికలోనూ తాను ఓడిపోలేదని.. అందువల్ల తనకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు జగదీశ్ తెలిపారు. తనకు టికెట్ నిరాకరిస్తే దానికి కారణం చెప్పాలని ఆయన కోరారు. ఎన్నికలకు దూరంగా వుండే ప్రసక్తి లేదని జగదీశ్ షెట్టర్ తేల్చిచెప్పారు. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప సైతం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు.
Also Read: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీలో కీలక పరిణామం.. ఎన్నికల రాజకీయాలకు దూరమని ప్రకటించిన సీనియర్ నేత
యువత కోసం సీనియర్లు తప్పుకోవడం అనే గొప్ప కల్చర్ బీజేపీలో వుంందని సీఎం బొమ్మై అన్నారు. అయితే ఒక ఇంటికి ఒకటే టికెట్ అనే సూత్రాన్ని కమలనాథులు పక్కగా ఫాలో అవుతున్న నేపథ్యంల కుమారుడి కోసం ఈశ్వరప్ప రాజకీయాలకు గుడ్ బై చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆయన వయసు 75 సంవత్సరాలు. సాధారణంగా 75 ఏళ్లు నిండినవారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన వున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారమే మాజీ సీఎం యడ్యూరప్ప కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించనుంది.