భారత్- చైనా మధ్య మళ్లీ ఘర్షణ.. 20మంది సైనికులకు గాయాలు

By telugu news teamFirst Published Jan 25, 2021, 12:20 PM IST
Highlights

సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. మూడు రోజుల క్రితం సిక్కింలోని నాతులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.

చైనా సైనికులు మరోసారి అతిక్రమించారు. భారత భూ భాగంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ఓవైపు ఇరు దేశాల మధ్య  చర్చలు జరుగుతుండగానే... సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. మూడు రోజుల క్రితం సిక్కింలోని నాతులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. 

ఈ ప్రయత్నాలను  భారత బలగాలు దీటుగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చైనా సైనికులను అడ్డుకునే ప్రయత్నంలోనే ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు గాయపడగా, చైనా సైనికులు 20 మంది గాయాలపాలయ్యారు.

Latest Videos

 అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా సరే... సరిహద్దుల్లో సమర్థవంతంగా సైనికులు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 

click me!