పత్రికా ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తల దాడి.. నలుగురు జర్నలిస్టులకు గాయాలు...

Published : Sep 09, 2021, 10:17 AM IST
పత్రికా ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తల దాడి.. నలుగురు జర్నలిస్టులకు గాయాలు...

సారాంశం

ఈ సంఘటనలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. కొంతమేరకు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనమీద ‘ప్రతివాదీ కలం’ సంపాదకుడు అనల్ రాయ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అగర్తలా : త్రిపుర రాజధాని అగర్తలలో ఒక పత్రికా కార్యాలయంమీద భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఉదంతంలో కొందరు బీజేప నేతల హస్తముందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం పరకారం ‘ప్రతివాదీ కలం’ అనే స్థానిక దినపత్రిక కార్యాలయంమీద దాడి జరిగింది. 

ఈ సంఘటనలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. కొంతమేరకు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనమీద ‘ప్రతివాదీ కలం’ సంపాదకుడు అనల్ రాయ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటన అనంతరం అగర్తల ప్రెస్ క్లబ్ సెక్రటరీ ప్రణబ్ సర్కార్ తో పాటు పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ‘ప్రతివాదీ కలం’ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ దాడులకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అధికార బీజేపీ విపక్ష భారతీయ కమ్యూనిస్టు పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

PREV
click me!

Recommended Stories

యువతకు AI శిక్షణ ఇచ్చేందుకు సరికొత్త పథకం... ఏదో తెలుసా?
Best Honeymoon Spots : ఖర్చు తక్కువ, కిక్ ఎక్కువ.. ఇండియాలో బడ్జెట్ ప్రెండ్లీ హనీమూన్ స్పాట్స్ ఇవే