కరోనా కలకలం: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

By narsimha lodeFirst Published Sep 9, 2021, 9:51 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. ఈ పెరుగుదలపై వైద్య శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో పండుగలు ఉన్న నేపథ్యంలో  కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. గత 24 గంటల్లో దేశంలో 43,263  కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్ో 43,263  కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు నిన్న ఒక్క రోజే ,338 మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3,31,39,981కి చేరింది.దేశంలో ప్రస్తుతం 3.93,614 లక్షల కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3,23,04,618 మంది కోలుకొన్నారు.  

తాజాగా మరణించిన వారిని కలుపుకొంటే దేశంలో ఇప్పటివరకు  4,41,749  మంది కరోనాతో మరణించారని ఐసీఎంఆర్ ప్రకటించింది.దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. కరోనా రోగుల మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో   71,65,97,428 మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కేరళ రాష్ట్రంలోనే కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కేరళలో నిన్న ఒక్క రోజే 30,196 కేసులు నమోదయ్యాయి.180 మందికి పైగా కరోనాతో మరణించారు. మరో వైపు ముంబైలో కూడ కరోనా కేసులు  పెరుగుతున్నాయి. 

click me!