బీజేపీ కి రాజీనామా.. మోదీపై విమర్శలు.. గుండు చేయించుకున్న నేత..!

Published : Oct 06, 2021, 11:23 AM ISTUpdated : Oct 06, 2021, 12:46 PM IST
బీజేపీ కి రాజీనామా.. మోదీపై విమర్శలు.. గుండు చేయించుకున్న నేత..!

సారాంశం

పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కాళీ మాత ఆలయం వద్ద యజ్ఞం నిర్వహించి, శిరో ముండనం చేయించుకున్నారు. త్రిపుర రాజకీయ అరాచకం, గందరోగళం నెలకుందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీపై ఓ బీజేపీ నేత విమర్శలు గుప్పించారు. తమ పార్టీ విధి విధానాలను విమర్శిస్తూ..  సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. పార్టీకి రాజీనామా చేసి.. శిరోముండనం చేయించుకున్నాడు. ఈ సంఘటన త్రిపురలో చోటుచేసుకోగా.. ఈ ఘటననకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పార్టీ దుర్మార్గపు పాలనకు ప్రాయశ్చితంగా తాను గుండు గీయించుకున్నట్టు త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కాళీ మాత ఆలయం వద్ద యజ్ఞం నిర్వహించి, శిరో ముండనం చేయించుకున్నారు. త్రిపుర రాజకీయ అరాచకం, గందరోగళం నెలకుందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు.

తాను బీజేపీలో ఉండలేనని, పార్టీ వీడుతానని ఎమ్మెల్యే ఆశిష్ దాస్ తెలిపారు. ఇటీవల పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించిన దాస్.. ఆమె 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి సరైన ప్రత్యర్ధని కొనియాడారు. అయితే, గత రెండేళ్లుగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసి ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. 2023 ప్రథమార్థంలో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. ఆ రాష్ట్రంపై టీఎంసీ దృష్టిసారించింది.

‘ఈ రోజు నేను బీజేపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు ప్రాయశ్చిత్తంగా గుండు గీయించుకున్నాను.. నేను పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. కానీ, బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో జరిగిన అరాచకం, దుష్టపాలన నన్ను కలచివేసింది.. అందువల్ల గత రెండేళ్లుగా ప్రభుత్వం చేసిన తప్పుడు పనులన్నింటినీ విమర్శిస్తున్నాను.. పార్టీ, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తున్నాను’ అని ఆశిష్ దాస్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా విమర్శలు గుప్పించారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu