ఎనిమిదేళ్ల చిన్నారి మర్మాంగానికి దారం కట్టి.. సీనియర్ల దాష్టీకం.. ఢిల్లీలో ఘటన..

By SumaBala BukkaFirst Published Dec 31, 2022, 10:20 AM IST
Highlights

ఓ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఎనిమిదేళ్ల జూనియర్ విద్యార్థి మీద దారుణానికి తెగబడ్డారు. అతని మర్మాంగానికి దారం కట్టి.. తీయోద్దని బెదిరించారు. 

ఢిల్లీ : ఢిల్లీలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మహిళల మీద అత్యాచారాల విషయంలోనే కాదు చిన్న పిల్లల మీద అఘాయిత్యాల విషయంలోనూ ముందుంటోంది. ఓ మూడో తరగతి విద్యార్థిపై నలుగురు సీనియర్ విద్యార్థులు అత్యంత దారుణంగా,  పాశవికంగా వ్యవహరించారు. ర్యాగింగ్ పేరుతో వికృతంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి మర్మాంగానికి దారం కట్టారు. ఈ దారుణమైన ఘటన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరగడం గమనార్హం.

ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్ లోని అటల్ ఆదర్శ్ అనే గవర్నమెంట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ స్కూల్లో ఎనిమిదేళ్ల బాదిత చిన్నారి మూడో తరగతి చదువుకుంటున్నాడు. ఈ ఘటన ఈనెల 24వ తేదీన జరిగింది. ఆ రోజు స్కూలుకు వెళ్లిన చిన్నారి బాత్ రూమ్ కు వెళ్ళిన సమయంలో సీనియర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ నలుగురు సీనియర్ల వయస్సు 16 సంవత్సరాలు. వీరు ఆ చిన్నారి పై దాడి చేశారు. ఆ తర్వాత అతడి మర్మాంగాన్ని దారంతో కట్టేశారు. ఆ దారాన్ని తీయవద్దని.. అలాగే ఉంచుకోవాలని బాదిత  బాలుడిని  హెచ్చరించారు. 

షాకింగ్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం..

తాము ఇలా చేసిన విషయం ఎవరికైనా చెబితే.. చిన్నారి తల్లిదండ్రులను చంపేస్తామని తీవ్రస్థాయిలో బెదిరించారు.  దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడు. దారం కట్టడంతో మర్మాంగం నొప్పి మొదలయింది.  ఆ నొప్పి భరించలేక స్కూలుకు రెండు రోజులపాటు వెళ్ళలేదు. ఈ ఘటన గత శనివారం జరగగా బుధవారం నాడు చిన్నారి స్నానం చేస్తుంటే తండ్రి గమనించాడు. అతడి మర్మాంగానికి దారం కట్టి ఉండటాన్ని చూసి ప్రశ్నించాడు. దీంతో చిన్నారి ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. అలా సీనియర్లు చేసిన  దారుణం బయటపడింది. వెంటనే అతను కొడుకును తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి వారి మీద ఫిర్యాదు చేశాడు. 

click me!