ట్రిపుల్ తలాక్ బిల్లు: రాజ్యసభలో గందరగోళం, మధ్యాహ్నానికి వాయిదా

By sivanagaprasad kodatiFirst Published Dec 31, 2018, 12:31 PM IST
Highlights

ప్రతిష్టాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే తొలి నుంచి బిల్లును అడ్డుకుంటామని చెబుతున్న కాంగ్రెస్ సహా మిగిలిన విపక్షాలు ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే.. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ప్రతిష్టాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే తొలి నుంచి బిల్లును అడ్డుకుంటామని చెబుతున్న కాంగ్రెస్ సహా మిగిలిన విపక్షాలు ఇందుకు అభ్యంతరం తెలిపాయి.

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే.. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘‘వుయ్ వాంట్ జస్టిస్ ’’ అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

సభా కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలగడంతో రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లుగా డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రప్రభుత్వం లోక్‌సభలో నెగ్గించుకోగా... రాజ్యసభలో ప్రతిపక్షాల బలం అధికంగా ఉండటంతో బిల్లు ఆమోదానికి గురవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

click me!