రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయిన కారు.. 10 మంది దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Dec 31, 2018, 10:24 AM IST
రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయిన కారు.. 10 మంది దుర్మరణం

సారాంశం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కచ్ జిల్లాలోని భవాచ్ జాతీయ రహదారిపై ఉప్పు లోడుతో వెళుతున్న ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలికి వెళ్లింది. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కచ్ జిల్లాలోని భవాచ్ జాతీయ రహదారిపై ఉప్పు లోడుతో వెళుతున్న ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలికి వెళ్లింది. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది..

అదే సమయంలో అటుగా వస్తున్న మరో ట్రక్కు కూడా కారును ఢీకొట్టింది. దీంతో రెండు ట్రక్కుల మధ్య చిక్కుకుని కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు..

భుజ్‌లోని తమ స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit