తక్, తక్ గ్యాంగ్ : టీఎంసీ ఎమ్మెల్యే భార్యను నిలువుదోపిడీ చేసిన దొంగలు... !

Published : Jul 24, 2021, 11:31 AM IST
తక్, తక్ గ్యాంగ్ : టీఎంసీ ఎమ్మెల్యే భార్యను నిలువుదోపిడీ చేసిన దొంగలు... !

సారాంశం

 శుక్రవారం మధ్యాహ్నం వివేక్ భార్య కారులో బైటికి వెళ్లింది. 2.15 ప్రాంతంలో డిఫెన్స్ కాలనీ ఫ్లై ఓవర్ వద్ద కారు వెడుతోంది. ఈటైంలో మోటారు సైకిల్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు దగ్గరికి వచ్చి టైరు చూపిస్తూ ఏదో చెప్పారు.

న్యూఢిల్లీ : ఓ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భార్యను దోచేశారు కొందరు దొంగలు. పక్కాప్లాన్ వేసి రెండు లక్షల నగదు, ఓ గోల్డ్ కాయిన్, ఐఫోన్, డాక్యుమెంట్లు కొట్టేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కోల్ కతా, జోరసకో నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా న్యూఢిల్లీ, లోధీ కాలనీలోని ఓ హోటల్ లో గత కొద్ది రోజుల నుంచి ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వివేక్ భార్య కారులో బైటికి వెళ్లింది. 2.15 ప్రాంతంలో డిఫెన్స్ కాలనీ ఫ్లై ఓవర్ వద్ద కారు వెడుతోంది. ఈటైంలో మోటారు సైకిల్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు దగ్గరికి వచ్చి టైరు చూపిస్తూ ఏదో చెప్పారు.

దీంతో డ్రైవర్ టైరులో ఏదో సమస్య ఉందని భావించి కారు ఆపాడు. అనంతరం మరో మోటారు సైకిల్ మీద వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు కారు బోనోట్ చూపించారు. డ్రైవర్ కారు బోనోట్ దగ్గరకు వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత వివేక్ భార్య ఉక్కపోత భరించలేక కారులోంచి బయటకు వచ్చింది.

ఇదే అదనుగా భావించిన మోటారు సైకిల్ మీద వచ్చిన వ్యక్తులు కారులోని రెండు లక్షల నగదు, ఐ ఫోన్, గోడ్ల్ కాయిన్, డాక్యుమెంట్లు కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తక్ తక్ గ్యాంగ్ పనేనని అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu