అక్రమ సంబంధం: ఇంట్లోంచి లాగి, మహిళను నగ్నంగా ఊరేగించారు

Published : Jun 15, 2021, 07:58 AM IST
అక్రమ సంబంధం: ఇంట్లోంచి లాగి, మహిళను నగ్నంగా ఊరేగించారు

సారాంశం

పశ్చిమ బెంగాల్ లో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో కొంత మంది గిరిజన మహిళను ఇంట్లోంచి బయటకు లాగి నగ్నంగా ఊరేగించారు.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర ప్రాంతంలో దారుణమైన, అమానుషమైన సంఘటన జరిగింది. కొంత మంది వ్యక్తులు ఓ గిరిజన మహిళను ఇంట్లోంచి లాగి, ఆమెను నగ్నంగా ఊరేగించారు. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో వారు ఆ పని చేశారు.

ఆ సంఘటనకు పాల్పడిన 11 మందిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.ు ఈ సంఘటన ఈ నెల 9వ తేదీ బుధవారం అలిపుర్దార్ జిల్లాలోని కుమర్ గ్రామ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సంఘటన వెలుగు చూసింది. 

అక్రమ సంబంధం కారణంగా ఆ మహిళ ఆరు నెలల క్రితం భర్తను వదిలేసినట్లు చెబుతున్నారు. గత వారం ఆమె తిరిగి వచ్చిందని, కొంత మంది స్థానికులు బుధవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డారని, బయటకు లాగి, వివస్త్రను చేశారని, బూతులు తిట్టుకుంటూ ఆమె గ్రామంలో ఊరేగించారని చెబుతున్నారు. 

ఆ సంఘటన తర్వాత ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఎవరు కూడా బయటకు సమాచారం ఇవ్వలేదు. వీడియోలు బయటకు రావడంతో విషయం పోలీసులకు తెలిసింది. ఆమె భర్తను వెంట పెట్టుకుని పోలీసులు అస్సాంలోని ఆమె తల్లిగారింటికి వెళ్లారు. అక్కడ ఆమె కనపించింది. ఆమె వెనక్కి తీసుకుని వచ్చారు. 

భర్త సమక్షంలో ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఆమె జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై దాడి చేసిన ఐదుగురు పరారీలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?