కేబినెట్ విస్తరణపై ఊహగాహనాలు:మంత్రులతో మోడీ భేటీ

Published : Jun 14, 2021, 08:50 PM IST
కేబినెట్ విస్తరణపై  ఊహగాహనాలు:మంత్రులతో మోడీ భేటీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారంనాడు రాత్రి మంత్రులతో కీలక సమావేశం  నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి  ప్రాధాన్యత లభించింది. 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారంనాడు రాత్రి మంత్రులతో కీలక సమావేశం  నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి  ప్రాధాన్యత లభించింది. మోడీ నివాసంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలతో  మోడీ భేటీ అయ్యారు.  కేంద్ర కేబినెట్ విస్తరణపై ఏడాదిగా ప్రచారం సాగుతోంది.  కరోనాతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  కేబినెట్ విస్తరణ వాయిదా పడింది.  కొందరు మంత్రులు  రెండు మూడు శాఖలను నిర్వహిస్తున్నారు. 

దీంతో కేంద్ర మంత్రి వర్గంలో అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్, బీహార్ నుంచి బిజేపి నేత సునీల్ మోడి,  బిజేపి లో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, జేడి-యు కి చెందిన ఇరువురు నేతలకు చోటు లభించే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది.కాంగ్రెస్ పార్టీకి చెందిన జతిన్ ప్రసాద్ ఇటీవలనే బీజేపీలో చేరారు. యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే తరుణంలో  జతిన్ ప్రసాద్ బీజేపీలో చేరడం కాంగ్రెస్ కు షాక్ కలిగింది. యూపీ ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీ మంత్రివర్గవిస్తరణను ప్లాన్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు