
ఇప్పటి వరకు మనం కేవలం ఫ్లాట్ ఫాంలో ఉండటానికి మాత్రమే ప్లాట్ ఫాం టికెట్ తీసుకునే వాళ్లం. అయితే.. ఇక నుంచి కేవలం ప్లాట్ ఫాం టికెట్ తో ఏకంగా రైలు ప్రయాణమే చేయవచ్చు. ఇది మరెక్కడో కాదు కేవలం మన దేశంలోనే.
ప్లాట్‌ఫామ్ టికెట్‌తోనే ఇక రైల్లో ప్రయాణించడానికి ప్యాసింజర్లకు భారతీయ రైల్వే అవకాశం కల్పించింది. గమ్యస్థానానికి ఎంత టికెట్టో ఆ ధరను మాత్రం ప్రయాణంలో చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా జారీచేసిన నిబంధనల మేరకు... ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు నేరుగా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) దగ్గరకు వెళ్లి తమకు ఎక్కడికి టికెట్ కావాలో చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రకారం టీటీఈ టికెట్ జారీ చేస్తారు.
టికెట్ల కోసం క్యూలో నిల్చోడం.. లేదంటే.. ఆలస్యమైనప్పుడు టికెట్ కొనుక్కోలేకపోయిన వారికి.. ఈ విధానం వల్ల ఉపయోగం కలగనుంది. కేవలం ప్లాట్ ఫాం టికెట్ తీసుకొని.. ఆ తర్వాత.. రైలులో టీటీఈ దగ్గర డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.