మిరాకిల్ : తల్లి పిలుపుతో.. చనిపోయిన కొడుకు లేచి వచ్చాడు.. !!

By AN TeluguFirst Published Jun 17, 2021, 1:08 PM IST
Highlights

హర్యానాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొడుకు మృతదేహాన్ని ఖననం చేసే సయమంలో ఓ తల్లి ఆవేదన.. కొడుకును తిరిగి రమ్మంటూ.. లేచిరా బిడ్డా, లేచిరా అంటూ ఆ తల్లి పిలిచిన పిలుపు నిజమయ్యాయి. తల్లి అలా పిలిచిన సెకన్లలో ఆ చిన్నారి శ్వాసించడం మొదలుపెట్టాడు నమ్మశక్యం కాకున్నా ఇది నిజంగా జరిగింది. 

హర్యానాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొడుకు మృతదేహాన్ని ఖననం చేసే సయమంలో ఓ తల్లి ఆవేదన.. కొడుకును తిరిగి రమ్మంటూ.. లేచిరా బిడ్డా, లేచిరా అంటూ ఆ తల్లి పిలిచిన పిలుపు నిజమయ్యాయి. తల్లి అలా పిలిచిన సెకన్లలో ఆ చిన్నారి శ్వాసించడం మొదలుపెట్టాడు నమ్మశక్యం కాకున్నా ఇది నిజంగా జరిగింది. 

హర్యానాలోని బహదూర్‌ ఘర్‌లో 20 రోజుల క్రితం 6 సంవత్సరాల ఓ చిన్నారి చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే అతని అంత్యక్రియల కోసం స్మశానానికి తరలించే సమయంలో తల్లి కొడుకు తలమీద ముద్దు పెట్టుకుని.. పదే పదే.. నా తండ్రీ లేచిరా, కొడుకా లేచిరా.. అంటూ ఏడుస్తూ పిలిచింది. ఇంతలోనే అతని శరీరంలో కదలిక ప్రారంభమయ్యింది. 

దాంతో వైద్యులు వెంటనే అతనికి చికిత్స ప్రారంభించారు. మంగళవారం నాడు ఆ చిన్నారి రోహ్ తక్ ఆసుపత్రి నుంచి నవ్వుతూ, ఆడుతూ తన ఇంటికి తిరిగి వచ్చాడు.

హితేష్, జాన్వి దంపతుల కొడుకు టైఫాయిడ్ బారిన పడ్డాడు. దీంతో వారు అతన్ని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స ఇస్తున్న వైద్యులు మే 26న చిన్నారి చనిపోయినట్లుగా ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని తీసుకుని బహదూర్‌ ఘర్‌లోని తమ ఇంటికి తిరిగి వచ్చారు. 

బాలుడి తాత విజయ్ వర్మ మాట్లాడుతూ.. బాలుడి అంత్యక్రియల కోసం ఏర్పాటు ప్రారంభించారు. అంతవరకు అతని శరీరాన్ని ఉప్పు, ఐస్ లో వేసి పెట్టారు. మరుసటి రోజు ఉదయం అంత్యక్రియలని కాలనీ వారికి కూడా సమాచారం అందించారు. 

ఆ తల్లి కొడుకు మృతిని తట్టుకోలేక మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తుంది. లెమ్మంటూ పార్థివ దేహాన్ని ఊపడం మొదలుపెట్టింది. ఆ చిన్నారి అత్త అన్ను కూడా అలాగే చేయడంతో శరీరంలో కదలిక కనిపించింది. వెంటనే అది గమనించిన తండ్రి.. కొడుకు మొహాన్ని కవర్లో నుంచి బైటికి తీశాడు. నెమ్మదిగా శ్వాస తీసుకోవడాన్ని గమనించి.. తన నోటితో కృత్రిమ శ్వాస అందించాడు. 

పక్కింటతను బాలుడి ఛాతి మీద నొక్కుతూ గుండె కొట్టుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా బాలుడు తనకు శ్వాస అందిస్తున్న తండ్రి పెదవిని కొరికాడు. అంతే వెంటనే బాబును ఢిల్లీ రోహ్ తక్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఇది మే 26న జరిగింది. 

అయితే అక్కడి డాక్టర్లు బాలు బతికే అవకాశాలు 15శాతం మాత్రమే ఉన్నాయని చెప్పి చికిత్స ప్రారంభించారు. అయితే బాలుడి శరీరం చికిత్సకు బాగా స్పందించింది. అంతే పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. 

దీంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రి హితేష్ అయితే తన పెదవి గాయాన్ని చూపిస్తూ మరీ కొడుకు విషయం చెబుతూ మురిసిపోతున్నాడు. 

click me!