కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

By telugu news teamFirst Published Jun 8, 2020, 12:55 PM IST
Highlights

బిరాసలా ప్రభుత్వ వైమానిక శిక్షణ సంస్థలో సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు టేకాప్ అయిన శిక్షణ విమానం కొద్దిసేపటికే కంకదహడ సమీపంలో కుప్పకూలిందని ధెంకనల్ జిల్లా ఎస్పీ అనుపమ జేమ్స్ చెప్పారు. 

శిక్షణ విమానం కూలి ఇద్దరు ట్రైనీ పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  విషాద సంఘటన సోమవారం ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిరాసలా వైమానిక కేంద్రం నుంచి సోమవారం ఉదయం టేకాఫ్ అయిన సెస్నా ఎఫ్ఏ -152 వీటీ ఈఎన్ఎఫ్ శిక్షణ విమానం కుప్పకూలింది. బిరాసలా ప్రభుత్వ వైమానిక శిక్షణ సంస్థలో సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు టేకాప్ అయిన శిక్షణ విమానం కొద్దిసేపటికే కంకదహడ సమీపంలో కుప్పకూలిందని ధెంకనల్ జిల్లా ఎస్పీ అనుపమ జేమ్స్ చెప్పారు. 

ఈ విమాన ప్రమాదంలో పైలట్ల శిక్షకుడు సంజయ్ కుమార్, ట్రైనీ పైలట్ అనీస్ ఫాతిమాలు మరణించారు. శిక్షణ విమానం టేకాఫ్ అయిన తర్వాత తలెత్తిన లోపంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పారు.మరణించిన సంజయ్ కుమార్ బీహార్ రాష్ట్ర వాసి. ట్రైనీ పైలట్ అనీస్ ఫాతిమా ఉత్తరభారతదేశానికి చెందినవారని ఎస్పీ  పేర్కొన్నారు. లాక్ డౌన్ అనంతరం జూన్ 1వతేదీన బిరాసలా వైమానిక శిక్షణ కేంద్రం పునర్ ప్రారంభించారు. 
 

click me!