ఏంటి ఇది.. కరోనా అంటే భయం పోయిందా?

By telugu news teamFirst Published Jun 8, 2020, 11:09 AM IST
Highlights

మే 31 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సైక్లింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ వంటి వ్యాయమాలకు సడలింపులు ఇచ్చింది. దాంతో మెరైన్‌ డ్రైవ్‌‌ వద్ద జనాలు గుంపులు, గుంపులుగా చేరారు. మాస్క్‌ ధరించారు కానీ సామాజిక దూరం పాటించలేదు. 

కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షల కేసులతో భారత్‌ ఇటలీని దాటేసి రికార్డులకెక్కగా.. తాజాగా మహారాష్ట్ర కూడా ఓ రికార్డును నమోదు చేసింది. కాగా... చైనాను కూడా దాటేసింది.

అయితే... కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్ది ప్రజల్లో భయం పెరిగాల్సింది పోయి... అసలు కరోనా లేనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ముంబయిలో కరోనా విజృంభిస్తున్న సమయంలో... అక్కడి ప్రజలు కుప్పలు తెప్పలుగా తిరుగుతున్నారు.

మే 31 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సైక్లింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ వంటి వ్యాయమాలకు సడలింపులు ఇచ్చింది. దాంతో మెరైన్‌ డ్రైవ్‌‌ వద్ద జనాలు గుంపులు, గుంపులుగా చేరారు. మాస్క్‌ ధరించారు కానీ సామాజిక దూరం పాటించలేదు. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నిహారికా కులకర్ణి ఈ ఫోటోని షేర్ చేశారు. 

 

‘అన్‌లాకింగ్ మొదటి దశలో భాగంగా జూన్ 3 నుంచి ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ కార్యకలాపాలు అనుమతించారు. జూన్ 6, 2020 సాయంత్రం మెరైన్ డ్రైవ్‌లో భారీగా జనం గుమిగూడారు’ అంటూ ఈ ఫోటోని షేర్‌ చేశారు.

దీనిపై నెటిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా’.. ‘మాస్క్‌ కూడా సరిగా వేసుకోని ఈ జనాలు ఇళ్లకు వెళ్లి కరోనా గురించి లెక్చర్లు దంచుతారు’.. ‘మెరైన్‌ డ్రైవ్‌ పేరును కరోనా డ్రైవ్‌గా  మార్చాలి’.. ‘కరోనా గిరోనా జాన్తా నై’’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. 

click me!